ఇంద్ర ధనువును సప్తవర్ణాలతో ముస్తాబు చేస్తే, అత్తరు పరిమళంపై చిటికెడు మంచిగంధం చిలకరిస్తే .. ఇవన్నీ కాదు కానీ.. గులాబీకి గులాబీ రంగు చీర చుడితే ఎలా ఉంటుందో.. ‘అమిగోస్’ చిత్ర కథానాయిక ఆషికా రంగనాథ్‌ను చూస్తే అర్థం అవుతుంది. ఆ బేబీపింక్ కలర్ శారీ.. ‘వాహ్ బేబీ’ అనిపించేలా ఉంది.
హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీతో చీరకే అందం వచ్చింది. కుందన్ చోకర్.. శంఖంలాంటి మెడకు కొత్త సొగసులు అద్దింది. కుర్రకారు పున్నమి వర్షంలో తడుస్తూ.. ‘అమిగోస్’ కోసం రీమిక్స్ చేసిన.. ‘ఎన్నో రాత్రులొస్తాయి కానీ.. రాదే వెన్నెలమ్మ’ అని పాడుకోవాల్సిందే! ఆ నిలువెత్తు సౌందర్యాన్ని వేడుకోవాల్సిందే!