AI Funny Images | పిల్లులు మహారాజులు, మహారాణులు అయితే.. ఆకట్టుకుంటున్న ఏఐ చిత్రాలు!
AI Funny Images | రామచిలుక లిప్‌స్టిక్ ఎందుకు రాసుకోకూడదు? నెమలమ్మకు క్యాట్‌వాక్ అవకాశం ఎవరిస్తారు? కోతికి పెళ్లికూతురిలా సింగారిస్తే? మృగరాజు రాజాలా ముస్తాబైతే? శునకానికి కనకపు సొమ్ములేస్తే? అసలు, రాజసం మనుషులకేనా? కుక్కకో, నక్కకో ఉండదా? .. సృజనకారుడి బుర్రలో తళుక్కుమనే ప్రతి ఆలోచనా ఏదో ఓ ఆవిష్కరణకు కారణం అవుతుంది.
AI Funny Images | ప్రతి ఊహా వాస్తవం. ప్రతి కల్పనా అద్భుతం. ప్రతి కలా కళాత్మకం. రామచిలుక లిప్‌స్టిక్ ఎందుకు రాసుకోకూడదు? నెమలమ్మకు క్యాట్‌వాక్ అవకాశం ఎవరిస్తారు? కోతికి పెళ్లికూతురిలా సింగారిస్తే? మృగరాజు రాజాలా ముస్తాబైతే? శునకానికి కనకపు సొమ్ములేస్తే? అసలు, రాజసం మనుషులకేనా? కుక్కకో, నక్కకో ఉండదా? .. సృజనకారుడి బుర్రలో తళుక్కుమనే ప్రతి ఆలోచనా ఏదో ఓ ఆవిష్కరణకు కారణం అవుతుంది. చిత్రకారుడు, విచిత్రకారుడు కూడా అయిన జయేశ్ సచ్దేవ్ కూడా అలాంటి వింతనే కలగన్నాడు. కృత్రిమ మేధ సాయంతో దాన్ని నిజం చేసే పనీ మొదలుపెట్టాడు. చకచకా పూర్తి చేశాడు. ఈ మధ్యే ఢిల్లీలోని ఓ ఆర్ట్ గ్యాలరీలో తన ఏఐ చిత్రాలను ప్రదర్శనకు ఉంచాడు.
ఇదో జిగేలుమనే జంతు ప్రపంచం. పులులు, పిల్లులు, కుక్కలు, నక్కలు.. మహారాజులు, మహారాణుల ముస్తాబులో మెరిసిపోతాయి. రాజసం ఒలకబోస్తాయి. దర్పాన్ని ప్రకటిస్తాయి. ప్రతి కుక్కకూ ఓ రోజు వస్తుంది.. అనే మాట ఈ చిత్రాల్లో నిజమే అయ్యింది. ఓ మార్జాల కుటుంబం.. సకల అలంకారాలతో ఫ్యామిలీ ఫొటో తీయించుకున్నట్టు.. భైరవ సార్వభౌములు కుడిఎడమల ధగధగా మెరిసిపోతున్న పడుచు శునక సతీమణుల మధ్య నిలబడి దర్పంగా పోజిచ్చినట్టు.. వానర పరివారం ఒకచోట కూడి కెమెరా వైపే చూస్తున్నట్టు.. ప్రతి చిత్రం ఓ ప్రయోగమే. ఇదొక సంకర సృష్టి.. హైబ్రీడ్ క్రియేషన్. ఈ కళలో జయేశ్ ఆరితేరిపోయారు. ఆ మధ్య నవ వధువుల్ని వ్యోమగాములుగా మార్చి మురిసిపోయాడీ చిత్రకారుడు.
‘కృత్రిమ మేధను చిత్రకళకు జోడించడం ద్వారా అనేక ప్రయోగాలు చేయవచ్చు. ప్రతి ఊహకూ ఓ రూపం ఇవ్వవచ్చు’ అంటారు జయేశ్. తను ‘క్విర్క్ బక్స్’ పేరుతో బ్రాండింగ్ ఏజెన్సీని కూడా నిర్వహిస్తున్నారు. జన్మస్థలం పుణె. సింగపూర్‌లోని ఆర్ట్స్ కాలేజీ నుంచి పట్టా అందుకున్నారు. పుణె-న్యూయార్క్ మధ్య చక్కర్లు కొడుతుంటారు. ఫ్యాషన్ రంగంలోనూ జయేశ్‌కు మంచి పేరుంది. ‘ఫ్యాషన్ కంటే కళనే ఇష్టపడతాను. ఫ్యాషన్ అంటే.. అందమైన అమ్మాయిల ముస్తాబు కళే కదా! దీంతో ఈ రంగంలోకీ రావాల్సి వచ్చింది’ అంటారు చమత్కారంగా. మొత్తానికి జయేశ్ కొత్త ఆవిష్కరణల గురించి ప్రపంచమంతా చర్చ జరుగుతున్నది. తిట్టేవాళ్లు తిడుతున్నారు. మెచ్చుకునేవాళ్లు మెచ్చుకుంటున్నారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!






