‘పాపం పసివాడు’ కథానాయిక రాశి సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తనను తాను యాక్టర్, క్రియేటర్, యానిమల్ లవర్, డ్రీమర్, అచీవర్‌గా పరిచయం చేసుకుంటుంది. ఇందులో ప్రతి మాటా తన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేదే. ఇంకొక్క విషయం ప్రస్తావించడం మరిచిపోయిందో, ఉద్దేశ పూర్వకంగానే విస్మరించిందో తెలియదు కానీ.. పూర్వాశ్రమంలో ఆమె ఎయిర్ హోస్టెస్. కాబట్టే, అలంకరణ పట్ల అంత శ్రద్ధ. చిరునవ్వులో ఆపాటి మెరుపు.
సి.ఎం. ప్రవీణ్