వ్యాక్స్ హ్యాపెనింగ్
అతివల అందాన్ని ఇనుమడింపజేసేవి ఆభరణాలే. అందుకే నగల ఎంపికలో ఆడవాళ్లు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. వారి ఉత్సాహం హెచ్చేలా ఎప్పటికప్పుడు రకరకాల మాడళ్లు తీసుకొస్తున్నారు డిజైనర్లు. బంగారం, వెండి, ప్లాటినం లాంటి లోహాలతోనే కాకుండా ఫ్యాబ్రిక్, సిల్క్, థ్రెడ్ తదితర చవకైన నగలనూ అందుబాటులోకి తెచ్చి అతివల హృదయాలను కొల్లగొడుతున్నారు.
అతివల అందాన్ని ఇనుమడింపజేసేవి ఆభరణాలే. అందుకే నగల ఎంపికలో ఆడవాళ్లు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. వారి ఉత్సాహం హెచ్చేలా ఎప్పటికప్పుడు రకరకాల మాడళ్లు తీసుకొస్తున్నారు డిజైనర్లు. బంగారం, వెండి, ప్లాటినం లాంటి లోహాలతోనే కాకుండా ఫ్యాబ్రిక్, సిల్క్, థ్రెడ్ తదితర చవకైన నగలనూ అందుబాటులోకి తెచ్చి అతివల హృదయాలను కొల్లగొడుతున్నారు. తాజాగా ఈ నగల జాబితాలో గోల్డ్ వ్యాక్స్ ఆభరణాలు వచ్చి చేరాయి. బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో తక్కువ ధరల్లో లభిస్తూ పుత్తడిని మరిపిస్తున్న గోల్డ్ వ్యాక్స్ జువెలరీ విశేషాలు ఇవి..
మహిళలు అనుసరించే ఫ్యాషన్ రోజురోజుకీ మారిపోతూ ఉంటుంది. కొన్నిరోజులు భారీ ఆభరణాలు, సంప్రదాయ దుస్తులు ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని ఏలుతుంటాయి. మరికొన్ని రోజులు తేలిక దుస్తులు, సన్నని గొలుసులు ట్రెండింగ్‌లో ఉంటాయి. పుత్తడి నగలు కొనడం భారంగా భావించే వాళ్లు.. తమ ఫ్యాషన్ ప్యాషన్ తీర్చుకోవడానికి ఇమిటేషన్ జువెలరీకి జై కొడుతుంటారు. అలాంటివే గోల్డ్ వ్యాక్స్ జువెలరీ. స్వర్ణాభరణాలను పోలి ఉండే వ్యాక్స్ నగలను చెబితే గానీ పుత్తడి కాదని గుర్తుపట్టలేరు.
తేనెపట్టు నుంచి తేనె తీసిన తర్వాత మిగిలిన దాన్నుంచి తీసేదే బీ వ్యాక్స్. రకరకాల సౌందర్య సాధనాలు, సబ్బులు, అలంకరణ సామగ్రి తయారీకి దీనిని వాడతారు. వివిధ ప్రక్రియల ద్వారా బీవ్యాక్స్ని వివిధ వస్తువుల తయారీకి అనుగుణంగా మలుస్తారు. మృదువుగా ఉండే బీవ్యాక్స్తో ఆభరణాలను తయారు చేస్తున్నారు జువెలరీ మేకర్స్. ఈ బీవ్యాక్స్ని రకరకాల పరిమాణాల్లో గుండ్రని పూసల్లా మలిచి వాటితో అందమైన నగల్ని రూపొందిస్తారు.

బంగారు పూత పూసిన వ్యాక్స్ పూసలకు ముత్యాలు, పూసలు, రాళ్లు జోడించి అదరగొడుతున్నారు. కంఠాభరణాలు, గాజులు, బ్రేస్లెట్లు.. ఒకటేమిటి ఒకరోజు అధికంగా ఉంటే ఎనిమిది వారాల నగలూ రూపొందించేలా ఉన్నారు. తేనియల మైనంతో తయారైన వ్యాక్స్ నగలు మగువ మేనిపై తళుకులీనుతున్నాయి. పలు ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలోనూ ఈ నగలు అందుబాటులో ఉన్నాయి. ఆలస్యమెందుకు ఓసారి ట్రై చేయండి!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

