Khammam Rural : సీఎం పర్యటన నేపథ్యంలో ఖమ్మంలో ట్రాఫిక్ ఆంక్షలు : ట్రాఫిక్ ఏసీపీ
ఈ నెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు ఖమ్మంలో ట్రాఫిక్ మళ్లింపు ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు.
ఖమ్మం రూరల్, జనవరి 16 : ఈ నెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు ఖమ్మంలో ట్రాఫిక్ మళ్లింపు ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. కావున వాహన ప్రయాణికులు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపును దృష్టిలో పెట్టుకుని పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి తమ గమ్యస్థానానికి చేరుకోవాల్సిందిగా ఆయన సూచించారు. అదేవిదంగా భారీ వాహనాలు, లారీలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ సజావుగా వెళ్లే వరకు హోల్డింగ్ పాయింట్లలో నిలుపుకోవాలన్నారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున నగర ప్రజలు, వాహనదారులు అవసరం ఉంటే తప్పా తమ వాహనాలను రోడ్లపైకి తీసుకురావద్దని కోరారు.
ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు
ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు
రాజమండ్రి- దేవరపల్లి – జంగారెడ్డిగూడెం- అశ్వరావుపేట- సత్తుపల్లి- భద్రాచలం- కొత్తగూడెం -మణుగూరు మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలు (కార్లు, చిన్న వాహనాలు మాత్రమే) కల్లూరు మరియు వైరా సోమవరం గ్రామం వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కి కోదుమూరు వద్ద హైవే దిగి అల్లిపురం మీదుగా బోనకల్ రోడ్డు చేరుకొని ధంసలపురం బ్రిడ్జి దగ్గర నుండి మరల గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది.
హైదరాబాద్ నుండి భద్రాచలం / కొత్తగూడెం వైపు వెళ్లే వాహనాలు
హైదరాబాద్ నుండి భద్రాచలం- కొత్తగూడెం సత్తుపల్లి – అశ్వరావుపేట- -రాజమండ్రి వెళ్ళు వాహనాలు పొన్నెకల్లు వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే మీదుగా వెంకటగిరి క్రాస్ రోడ్ వద్ద హైవే దిగి (కార్లు,చిన్న వాహనాలు మాత్రమే) ప్రకాష్ నగర్, చర్చి కాంపౌండ్, ముస్తఫా నగర్, అల్లిపురం మీదుగా కోదుమూరు వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే బిడ్జి కింద నుండి వందనం మీదుగా కొత్త కలెక్టరేట్ సమీపంలోని వైరా రోడ్డు చేరుకొని భద్రాచలం – రాజమండ్రి వైపు వెళ్లవలసి ఉంటుంది.
సత్తుపల్లి / అశ్వరావుపేట నుండి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు
సత్తుపల్లి -అశ్వరావుపేట నుంచి వరంగల్ వైపునకు వెళ్లి వాహనాలు ఖమ్మం కలెక్టరేట్ దాటిన తర్వాత ఎస్ఆర్ గార్డెన్ నుంచి రఘునాథపాలెం ఆపిల్ సెంటర్ మీదుగా లింగాల చేరుకొని డోర్నకల్- మహబూబాద్ మీదుగా వరంగల్ వెళ్లవలసి ఉంటుంది.
ఇల్లందు నుండి ఖమ్మం పట్టణంలోకి వచ్చే వాహనాలు రఘునాధపాలెం ఆపిల్ సెంటర్ నుండి ఎస్సార్ గార్డెన్ వచ్చి గోపాలపురం- గొల్లగూడెం మీదుగా లకారం చేరుకుని ఖమ్మం పట్టణంలోకి వెళ్లవలసి ఉంటుంది.
వరంగల్ నుండి ఖమ్మం / సత్తుపల్లి / కొత్తగూడెం వైపు వచ్చే వాహనాలు
వరంగల్ నుండి సత్తుపల్లి – రాజమండ్రి- కొత్తగూడెం మరియు ఖమ్మం పట్టణం లోకి వచ్చే (కార్లు, చిన్న వాహనాలు మాత్రమే) ఎదులాపురం ఎక్స్ రోడ్ నుంచి వరంగల్ క్రాస్ రోడ్ మీదుగా నాయుడుపేట చేరుకొని అక్కడి నుండి గాంధీ చౌక్ మీదుగా చర్చి కాంపౌండ్ ముస్తఫానగర్- అల్లిపురం కోదుమూరు వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే బిడ్జి కింద నుండి వందనం మీదుగా కొత్త కలెక్టరేట్ సమీపంలోని వైరా రోడ్డు కు వెళ్లవలసి ఉంటుంది.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

