ఖమ్మం : ఖమ్మంలో అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మెన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ చేతుల మీదుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వెబ్సైట్ ను ఆవిష్కరించారు. తెలంగాణ కోసం ఉద్యమకారులు చేసిన ఉద్యమం వివరాలను , పోరాటాలను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వెబ్సైట్ లో పొందుపరిచి భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ వెబ్సైట్ను ప్రారంభించామని ఉద్యమ కారులు ఎవరైనా సరే తమ వివరాలనుwww. tuf.org.in ఈ వెబ్సైట్ లో పొందుపర్చవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి ఖమ్మం జిల్లా చైర్మన్ డాక్టర్ కెవి కృష్ణారావు, రాష్ట్ర చైర్మన్ బత్తుల సోమయ్య,ఉమ్మడి నల్లగొండ చైర్మన్ అనంతుల మధు,భట్టు రాజేందర్,పగడాల నరేందర్,పాలకుర్తి కృష్ణ, లింగన్న బోయిన సతీష్,రడo సురేష్,గుంతేటి వీరభద్రం,మాదాసు శ్రీనివాస్, బాసాతి హన్మంతరావు,అంగిడి భిక్షం,అఫ్జల్, సోమరాజు, భద్రునాయక్,చావా రమేష్, దేవళ్ల నాగేశ్వరావు,యాదగిరి,తోట వెంకట నారాయణ,ఊళ్లోజు వెంకన్న , బెల్లంకొండ నాగేశ్వరరావు,గుండు రంజిత్,బొందల వీరభద్రం తదితరులు పాల్గొన్నారు .