పిల్లల ఆరోగ్యంపై స్పెషల్ కేర్
పోషకాహారం లోపంతో బాధపడే చిన్నారులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. భావిపౌరులుగా ఎదగాల్సిన పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది.
- ఆరోగ్య కేంద్రాలుగా మారిన అంగన్వాడీలు
- ఎత్తు, బరువుకు తగ్గట్టు పోషకాహారం అందజేత
- హెల్త్ ప్రొఫైల్ కార్డులో ప్రతి నెలా వివరాల నమోదు
- పోషకాహార లోపం చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ
సత్తుపల్లి, డిసెంబర్ 14 : పోషకాహారం లోపంతో బాధపడే చిన్నారులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. భావిపౌరులుగా ఎదగాల్సిన పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. వయస్సుకు తగిన బరువు, ఎత్తు ఉండేలా పోషకాహారాన్ని అందజేస్తున్నది. ఇందుకోసం ప్రతి అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు సంబంధించిన ప్రత్యేక హెల్త్ ప్రొఫైల్ను తయారుచేస్తున్నది. పోషకాహార లోపం ఉన్నవారిని గుర్తించి వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. చిన్నారుల హెల్త్ ప్రొఫైల్ కోసం అంగన్వాడీ కేంద్రాలకు పర్యవేక్షణ కార్డులను అందజేసింది. వాటిలో ఎప్పటికప్పుడు పిల్లల వివరాలను పొందుపరిచి తల్లిదండ్రులకు అందజేస్తున్నారు.
జిల్లాలో కేంద్రాలు, చిన్నారులు
జిల్లాలో 1,605 అంగన్వాడీ కేంద్రాలు, 235 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో ఏడు నెలల నుంచి మూడేళ్ల వయస్సున్న 38,602 మంది, మూడు నుంచి ఆరేళ్ల వయస్సున్న 26,418 మంది చిన్నారులున్నారు.
తల్లిదండ్రుల వద్ద ఆరోగ్య సమాచారం
అంగన్వాడీ చిన్నారుల ఆరోగ్య పరిస్థితి గతంలో వారు తల్లిదండ్రులకు తెలిసేది కాదు. ప్రభుత్వం హెల్త్ ప్రొఫైల్కార్డులు అందించడం ద్వారా ఎప్పటికప్పుడు చిన్నారుల ఆరోగ్య సమస్యలపై తల్లిదండ్రులకు తెలిసే అవకాశం కలిగింది. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు గుడ్లు, పాలు, బాలామృతం, స్నాక్స్తోపాటు పూర్ణ ప్రాథమిక విద్య అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారంతో చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఎదుగుతున్నారు. కొంతమంది చిన్నారుల్లో పోషకాహార లోపం కనిపిస్తుండడంతో హెల్త్ ప్రొఫైల్కార్డులో వారి వ్యక్తిగత సమాచారం నమోదు చేస్తున్నారు. తద్వారా వారి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు అదనంగా పోషకాహారం అందిస్తున్నారు.
పర్యవేక్షణ కార్డు ద్వారా ఏంచేస్తారంటే…
- ప్రతి అంగన్వాడీ కేంద్రంలో 0-5 సంవత్సరాల చిన్నారుల బరువు, ఎత్తు, భుజం చుట్టుకొలత ప్రతి నెలా కార్డులో నమోదు చేస్తారు.
- చిన్నారి పేరు, తండ్రి పేరు, పుట్టినప్పుడు చిన్నారి బరువు, అంగన్వాడీ కేంద్రం పేరు, చిరునామా కార్డులో నమోదు చేసి ఫొటో అతికిస్తారు.
- కార్డులో ఆకుపచ్చ రంగు సాధారణ స్థాయి, పసుపు రంగు తక్కువ పోషణలోపం, ఎరువు రంగు తీవ్ర పోషణ లోపాన్ని సూచిస్తాయి. దాని ప్రకారం చిన్నారికి తగిన పోషకాహారం అందిస్తారు.
- షెడ్యూల్ ప్రకారం వ్యాధి నిరోధక టీకాలు, నులిపురుగుల మాత్రలు, ఐరన్ఫోలిక్, విటమిన్ ఏ, యాంటి బయోటిక్ మందులు అందిస్తారు.
ప్రతి నెలా కార్డులో నమోదు చేస్తాం..
అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారుల ఎత్తు, బరువు, చుట్టుకొలతలను వారి ఆరోగ్య సమాచారం కార్డులో నమోదు చేసి పెరుగుదల, పర్యవేక్షణకార్డులు తల్లిదండ్రులకు అందజేస్తాం. ప్రతి నెల 1 నుంచి 5వ తేదీ లోపు చిన్నారుల బరువు, ఎత్తు కొలతలు తీసుకుంటాం. చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం కోసం పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలను తల్లిదండ్రులకు వివరిస్తాం.
– రాణి, అంగన్వాడీ టీచర్, సత్తుపల్లి
సరైన పోషకాహారం అందిస్తాం..
పోషకాహార లోపం ఉన్న చిన్నారులను గుర్తించి వారికి అవసరమైన పోషకాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తాం. దీనికోసం ప్రతి నెలా చిన్నారుల ఆరోగ్య సమాచారాన్ని కార్డులో నమోదు చేసి వారి తల్లిదండ్రులకు అందజేస్తాం. పిల్లల పెరుగుదలపై అంగన్వాడీ టీచర్లు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. ఎప్పటికప్పుడు చిన్నారుల పెరుగుదలను పరిశీలిస్తాం.
– కొండమ్మ, సీడీపీవో, సత్తుపల్లి
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

