ఖమ్మం రూరల్: జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా కమిటీ పిలుపు మేరకు ఖమ్మం రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నాయుడుపేట సర్కిల్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. పాలకవర్గాల నిర్లక్ష్య వైఖరి, అణచివేత ధోరణితో పాటు జర్నలిస్టుల సంక్షేమ పథకాల అమలులో చూపుతున్న వివక్షను నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలను అందించాలని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ నాయకులు, ఖమ్మం రూరల్ విలేకరులు నర్సింగ్ రంగారావు (ఆంధ్రప్రభ), బంక అశోక్ (ప్రజాపక్షం), రెబ్బగొండ్ల గోపి (విశాలాంధ్ర) లక్ష్మణ్ (నమస్తే తెలంగాణ ) తదితరులు పాల్గొన్నారు.