MLC Elections | నమస్తే తెలంగాణ వెబ్ న్యూస్ ఎఫెక్ట్.. ఫ్లెక్సీలు తొలగించిన ఎన్నికల అధికారులు
MLC Elections | ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రానికి కొద్ది దూరంలో ఏర్పాటు చేసిన అభ్యర్థుల ఫ్లెక్సీలను తొలగించారు.
MLC Elections | ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రానికి కొద్ది దూరంలో ఏర్పాటు చేసిన ఆయా అభ్యర్థుల వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల పట్ల కొద్దిసేపటి క్రితం నమస్తే తెలంగాణ వెబ్ న్యూస్లో ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైన మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఎన్నికల అధికారులు పోలీసు అధికారులు టెంట్ల వద్దకు చేరుకొని ఫ్లెక్సీలను తొలగించడం జరిగింది. దీంతో తిరిగి యధావిధిగా అభ్యర్థుల ఫాలోవర్స్ సాదాసీదాగా ప్రచారం మొదలుపెట్టారు.
మండల కేంద్రం జలగం నగర్ ఉన్నత పాఠశాలలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికారులు పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రంలో మొత్తం 48 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల సరిహద్దులో పోటీ చేసిన అభ్యర్థుల అనుచరులు పెద్దపెద్ద టెంట్లు వేసి అభ్యర్థుల ఫ్లెక్సీలను బహిరంగంగానే ప్రదర్శించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో కనపడే విధంగా ఒక వర్గం భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. రకరకాల జెండాలను కడుతూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నటువంటి ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా అభ్యర్థుల అనుచరులు భారీ టెంట్లతో పాటు జెండాలు, అభ్యర్థుల ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలు ప్రదర్శించడం పలు వివాదాలకు దారి తీసింది.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

