కొత్త చట్టాలకు సవరణ చేయాలి
కొత్తగా తెచ్చిన నేర చట్టాలను ఒకసారి సమీక్షించి స్వల్ప సవరణలు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలో ఖమ్మంకు చెందిన సీనియర్ న్యాయవాది తాళ్లూరి దిలీప్ చౌదరి ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్‌ను ఢిల్లీలో బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు.
ఖమ్మం/ ఖమ్మం లీగల్, జూలై 24: కొత్తగా తెచ్చిన నేర చట్టాలను ఒకసారి సమీక్షించి స్వల్ప సవరణలు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలో ఖమ్మంకు చెందిన సీనియర్ న్యాయవాది తాళ్లూరి దిలీప్ చౌదరి ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్‌ను ఢిల్లీలో బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న సెంట్రల్ నోటరీల నియామకాలను వెంటనే చేపట్టాలని, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లును అమలు చేయాలని వినతిలో పేర్కొన్నారు.
సెంట్రల్ నోటరీస్ నోటిఫికేషన్ 2021లో వేయగా.. 2 వేల మంది న్యాయవాదులు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి నియామకాలు చేపట్టాలని మంత్రి దృష్టికి తెచ్చారు. చట్టాల సవరణల విషయంలో జిల్లా జడ్జిలు, జిల్లా కోర్టుల ప్రాక్టీసింగ్ సీనియర్ న్యాయవాదుల సూచనలు స్వీకరిస్తే బాగుంటుందని, ఇందుకోసం సదస్సులు, సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఎంపీ రవిచంద్ర, న్యాయవాదులు దిలీప్‌చౌదరి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాస్, సీనియర్ న్యాయవాది సంక్రాంతి రాజశేఖర్ తదితరులు మంత్రికి వివరించారు. వీటన్నింటినీ శ్రద్ధగా విన్న మంత్రి తప్పకుండా పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

