వైరాటౌన్, మార్చి 11 : మద్యం అమ్మకాలపై అదనంగా వసూలు చేస్తున్న వ్యాట్టాక్స్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వ్యాపారులు వైరా ఐఎంఎల్ మద్యం డిపో ఎదుట సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా వైన్స్ అండ్ బార్ అసోసియేషన్ జిల్లా నాయకులు మాట్లాడుతూ మద్యం అమ్మకాలపై జీఎస్టీ, ఇతర టాక్స్‌లు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు.
దీనికి అదనంగా వాట్టాక్స్ పేరుతో మరో ఏడు శాతం పెంచడం వల్ల తీవ్రంగా నష్టపోతామన్నారు. వెంటనే దానిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఐఎంఎల్ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైన్స్ అండ్ బార్ అసోసియేషన్ జిల్లా నాయకులు గుర్రాల శ్రీనివాసరెడ్డి, గొర్రెపాటి నరేశ్ష్, సుబ్బారావు, ఉమ్మడి జిల్లా వైన్ షాపు నిర్వాహకులు పాల్గొన్నారు.