‘రుణాల వసూళ్లకు న్యాయపరమైన చర్యలు’
కారేపల్లి సోసైటీ ఆధ్వర్యంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పట్టుదలతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ద్వారా రైతుకు మద్దతు ధర కల్పించడం జరిగిందని కారేపల్లి సోసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు అన్నారు. గురువారం కారేపల్లి సోసైటీ కార్యాలయంలో..
కారేపల్లి, మే 28 : కారేపల్లి సోసైటీ ఆధ్వర్యంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పట్టుదలతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ద్వారా రైతుకు మద్దతు ధర కల్పించడం జరిగిందని కారేపల్లి సోసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు అన్నారు. గురువారం కారేపల్లి సోసైటీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోసైటీ ద్వారా మాదారంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ద్వారా 803 రైతులకు సంబంధించి రూ.11.94 కోట్ల విలువైన 49758.50 క్వింటాళ్ల మొక్కజొన్నను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. దీని ద్వారా రైతులకు రూ.2.99 కోట్లు లాభం చేకూరిందన్నారు. మొక్కజొన్న కొనుగోలు సంబంధించి ప్రభుత్వం పైకం విడుదల చేసిందని, రైతు ఖాతాలో మండు రోజులలో రైతు ఖాతాలలో జమ కానున్నాయని తెలిపారు.
సోసైటీ రుణ వసూళ్లపై ప్రత్యేక కార్యాచరణ చేసినట్లు తెలిపారు. రైతులు తప్పని సరిగా వడ్డీలు చెల్లించి రుణాలు రెన్యూవల్ చేసుకోవాలన్నారు. రుణాల రెన్యూవల్ చేసుకోవటం ద్వారా రుణమాఫీ, పావలా వడ్డీ రాయితీ పొందవచ్చన్నారు. బకాయిల వసూళ్లకు ఇప్పటికే న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే బకాయిదారులకు నోటీసులు ఇవ్వటం జరిగిందన్నారు. రికవరీ సెక్షన్ ద్వారా రుణ వసూళ్లకు జప్తులు, తనఖా పెట్టిన భూములపై జెండాలు పెట్టి స్వాదీనంకు చర్యలు జరుగుతున్నాయన్నారు. రైతు సోదరులు సోసైటీని వినియోగించుకోవటం ద్వారా అర్ధిక అభివృద్ధి చెందాలని కోరారు. ఈ సమావేశంలో కార్యదర్శి హనుమంతరావు, డైరక్టర్లు అడ్డగోడ ఐలయ్య, మర్సకట్ల రోషయ్య, కొత్తూరి రామారావు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

