నెలాఖరుకు భూ సేకరణ పూర్తి చేస్తాం
జాతీయ రహదారుల కోసం అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెల చివరి వరకు పూర్తి చేస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సీఎం రేవంతరెడ్డి.. జాతీయ రహదారులకు అవసరమైన భూ సేకరణపై కలెక్టర్లతో ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎస్ రామకృష్ణారావులతో కలిసి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. స
- వీసీలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
మామిళ్లగూడెం, సెప్టెంబర్ 22: జాతీయ రహదారుల కోసం అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెల చివరి వరకు పూర్తి చేస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సీఎం రేవంతరెడ్డి.. జాతీయ రహదారులకు అవసరమైన భూ సేకరణపై కలెక్టర్లతో ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎస్ రామకృష్ణారావులతో కలిసి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఎన్‌హెచ్ 163జీలో భాగంగా 12 కిలోమీటర్ల మేర రోడ్డు వేసేందుకు 42 హెక్టార్ల భూ సేకరణ చేయాల్సి ఉందని తెలిపారు.
ఇందుకోసం కొదుమూరులో రైతులతో చర్చిస్తున్నామని, వారిని ఒప్పించి పెండింగ్‌లో ఉన్న 2.6 కిలోమీటర్ల భూ సేకరణను ఈ నెలలోనే పూర్తి చేస్తామన్నారు. మల్లెమడుగు, రేగులచలక రెవెన్యూ గ్రామాలకు సంబంధించి ఎన్‌హెచ్ నుంచి పరిహారం చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని, సదరు గ్రామస్తులతో మాట్లాడి బ్యాంకు వివరాలు తీసుకొని అక్టోబర్ 15 నాటికి భూ బదలాయింపు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో డీఎఫ్‌వో సిద్ధార్థ విక్రమ్‌సింగ్, ఎన్‌హెచ్ ఈఈ యుగేందర్, కలెక్టరేట్ భూ సేకరణ విభాగం అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
Sai Pallavi | నా బ్రెయిన్ వాడలేదు.. సీత పాత్రపై సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కొత్తగూడెం ఏరియాలో అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

