Water Crisis | ఏదులాపురంలో వారం రోజులుగా తాగునీటి సరఫరా బంద్.. కాలనీవాసుల అవస్థలు!
Water Crisis | ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలోని 23వ వార్డులో తాగునీటి సమస్యతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో భారీ వాటర్ ట్యాంకు, బోరు మోటారు, మిషన్ భగీరథ కనెక్షన్ ఉన్నప్పటికీ వారం రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది.
Water Crisis | ఖమ్మం రూరల్: ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలోని 23వ వార్డులో తాగునీటి సమస్యతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో భారీ వాటర్ ట్యాంకు, బోరు మోటారు, మిషన్ భగీరథ కనెక్షన్ ఉన్నప్పటికీ వారం రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. స్వయంగా మున్సిపల్ చైర్పర్సన్ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులోనే ఈ పరిస్థితి నెలకొనడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వారం రోజుల క్రితం వాటర్ ట్యాంకు సమీపంలోని బోరు మోటారు మరమ్మతులకు గురికావడంతో అధికారులు దానిని రిపేరుకు తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అదే సమయంలో మిషన్ భగీరథ నుంచి కూడా నీటి సరఫరా నిలిచిపోవడంతో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి నీటి కోసం ఎదురుచూస్తున్నా సరఫరా పునరుద్ధరణ కాలేదని కాలనీవాసులు వాపోతున్నారు.
ఇళ్లలో బోరు సౌకర్యం లేని కుటుంబాలు తాగునీటి కోసం ఇతర ప్రాంతాల్లోని బోరింగుల వద్దకు వెళ్లాల్సి వస్తున్నది. ముఖ్యంగా గృహిణులు నీటిని తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ అవసరాలకు సరిపడా నీరు అందకపోవడంతో కుటుంబాల నిర్వహణ భారంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నీటి సమస్యపై మున్సిపల్ వార్డు అధికారి, సరఫరా సిబ్బందిని పలుమార్లు ప్రశ్నించినా ఫలితం కనిపించలేదని వారు ఆరోపిస్తున్నారు. నీటి సరఫరా ఎప్పుడు పునరుద్ధరిస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
చైర్పర్సన్ వార్డులోనే సమస్య!
ఏదులాపురం మున్సిపాలిటీలోని 32 వార్డుల్లో 23వ వార్డు ప్రత్యేకంగా ప్రస్తావనకు వస్తున్నది. మున్సిపల్ చైర్పర్సన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ నీరు అందకపోవడానికి కారణమేంటని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి బోరు మోటారుకు మరమ్మతులు పూర్తి చేయడంతోపాటు మిషన్ భగీరథ నీటి సరఫరాను పునరుద్ధరించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించి తమ ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Crisis | ఏదులాపురంలో వారం రోజులుగా తాగునీటి సరఫరా బంద్.. కాలనీవాసుల అవస్థలు!
Pyare Miyan: మైనర్ అమ్మాయిల రేప్.. నిందితుడికి 10 జీవితకాల శిక్షలు
Red alert | అర్నాబ్ తుఫాన్ కారణంగా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
Don’t Trouble the Trouble | ఓటీటీలోకి ఫహాద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’.. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అంటే..!
Cyclone Arnab | తీరం దాటుతున్న ‘అర్నబ్’.. మరో రెండు గంటలు కీలకం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

