‘మురుసు తుఫాను బాధితులను తక్షణమే ఆదుకోవాలి’
మురుసు తుఫాను ప్రభావంతో పంటలు నష్టపోయి తీవ్ర నిరాశలో ఉన్న రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు చండ్ర నరేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. రైతు సంఘం నాయకులతో కలిసి...
– పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించాలి
- రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలి
- తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు చండ్ర నరేంద్ర కుమార్
జూలూరుపాడు, నవంబర్ 05 : మురుసు తుఫాను ప్రభావంతో పంటలు నష్టపోయి తీవ్ర నిరాశలో ఉన్న రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు చండ్ర నరేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. రైతు సంఘం నాయకులతో కలిసి మండల వ్యాప్తంగా నీట మునిగిన, దెబ్బతిన్న పంట పొలాలను గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తుఫాను సృష్టించిన బీభత్సానికి జిల్లా వ్యాప్తంగా వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంటలు అకాల వర్షాల కారణంగా నేలకొరిగి, వర్షపు నీటిలో మునగడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఇప్పటికే పెరుగుతున్న పెట్టుబడుల భారం, అధిక సాగు ఖర్చులతో సతమతమవుతున్న అన్నదాతలకు ఈ ప్రకృతి వైపరీత్యం కోలుకోలేని దెబ్బ కొట్టిందని విచారం వ్యక్తం చేశారు.
వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను రంగంలోకి దించి, జిల్లా వ్యాప్తంగా జరిగిన పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. దెబ్బతిన్న ప్రతి పంటనూ, నష్టపోయిన ప్రతి రైతునూ క్షేత్రస్థాయిలో గుర్తించి పారదర్శకంగా నష్టాన్ని అంచనా వేయాలన్నారు. పత్తి పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి రూ.30 వేలు, అలాగే మొక్కజొన్న, మిర్చి, వరి పంటలు నష్టపోయిన వారికి ఎకరానికి రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట పొలాల పరిశీలన కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి గుండుపిన్ని వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి యాస రోశయ్య, నాయకులు పొన్నెకంటి వెంకటేశ్వర్లు, వలమల్ల సామేలు, తూము కోటయ్య, దుద్దుకూరు శ్రీను, చీమకుర్తి సంతోష్, మద్దెబోయిన నరసింహారావు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మురుసు తుఫాను బాధితులను తక్షణమే ఆదుకోవాలి’
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ నిర్మాతకు భారీ నష్టాలు.. అసలు బ్రేక్ ఈవెన్ అన్నా అవుతుందా?
Ala Venkateswar Reddy | కాంగ్రెస్ అసమర్థతతో ఎండిన పంటలు : మాజీ ఎమ్మెల్యే ఆల వేంకటేశ్వర్‌రెడ్డి
IPL: చెన్నై జట్టులోకి ఎస్ఆర్హెచ్ బ్యాటర్.. 7 కోట్లు వదులుకున్న లివింగ్‌స్టోన్
Anjaiah Yadav | ఎండిన పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

