భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
అధికార దర్పం కాదు.. బాధ్యతల దర్పణం. ఆర్భాటపు సమీక్షలు కాదు.. అనునిత్యం క్షేత్రస్థాయి పర్యటనలు. కార్యాలయాలకే పరిమితం కాని పాలన. ప్రజల చెంతకే వెళ్లే పరిపాలన. తప్పు చేస్తే ఉపేక్షించని కఠిన వైఖరి. ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపే కార్యదక్షత...
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 22 : అధికార దర్పం కాదు.. బాధ్యతల దర్పణం. ఆర్భాటపు సమీక్షలు కాదు.. అనునిత్యం క్షేత్రస్థాయి పర్యటనలు. కార్యాలయాలకే పరిమితం కాని పాలన. ప్రజల చెంతకే వెళ్లే పరిపాలన. తప్పు చేస్తే ఉపేక్షించని కఠిన వైఖరి. ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపే కార్యదక్షత. ప్రభుత్వ ఆస్పత్రుల నుండి పాఠశాలల వరకు ఆకస్మిక తనిఖీలు. భూ సమస్యల నుండి ప్రజావాణి అర్జీల వరకు పరిష్కారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్‌కు అరుదైన అవార్డు దక్కింది. బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా కాలేదు. అప్పుడే పాలనలో తనదైన ముద్ర వేసే దిశగా అడుగులు. వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, జిల్లాలోని కీలక అంశాలపై దృష్టి సారించడంతో పాటు సమాచార హక్కు చట్టం అమలులో రాష్ట్రస్థాయి అవార్డును అందుకున్నారు.
వైద్య, విద్యా సేవలపై నిఘా
ప్రభుత్వ ఆస్పత్రులు, విద్యా సంస్థలు సామాన్య ప్రజలకు కీలకమైన సేవా కేంద్రాలు. వీటిలో సేవల నాణ్యత, సిబ్బంది బాధ్యతాయుత పనితీరు మెరుగుపడాలన్న దిశగా కలెక్టర్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి, సంబంధిత అధికారులు వాటిపై స్పందించేలా చూడటం పాలనలో కీలకమైన అంశంగా నిలుస్తోంది.
భూ సర్వే సమస్యల పరిష్కారానికి ముందడుగు
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో భూ సర్వే కార్యక్రమాలను ముమ్మరంగా చేపడుతున్నారు. భూములకు సంబంధించిన వివాదాలు, రెవెన్యూ వ్యవహారాలు ప్రజలకు ఇబ్బందులు కలిగించే అంశాలు కావడంతో వాటి పరిష్కారంలో సంబంధిత శాఖల సమన్వయానికి ప్రాధాన్యమిస్తున్నారు. రెవెన్యూ, అటవీ భూములకు సంబంధించిన సమస్యలపై దృష్టి సారిస్తూ పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు.
ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ
ప్రజావాణి కార్యక్రమం ద్వారా వివిధ మండలాల ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. అర్జీలను పరిశీలించి, నిబంధనల ప్రకారం సత్వర పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవడంపై కలెక్టర్ దృష్టి సారిస్తున్నారు. ప్రజల సమస్యలను వినడం మాత్రమే కాకుండా వాటి పరిష్కారానికి శాఖల వారీగా చర్యలు చేపట్టడం ప్రజాకేంద్రిత పాలనలో కీలకం కావడం ఆయన పనితీరుకు దర్పణం పడుతుంది.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
Singireddy Niranjanreddy | రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం.. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్న: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
France Protests | ఫ్రాన్స్‌లో నిరసనలు.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన
సింగరేణి సమస్యలపై కేటీఆర్‌తో ఎంపీ రవిచంద్ర చర్చ
MCD: కాలుష్యంపై చర్చ.. ఢిల్లీ మున్సిపల్ సమావేశాల్లో గందరగోళం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

