పడకేసిన పారిశుధ్యం… పట్టించుకోని అధికారులు
బూర్గంపహాడ్ మండల కేంద్రంలో పారిశుధ్యం పడకేసింది. మేజర్ పంచాయతీలో ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం, డ్రైనేజీలను పిచ్చి చెట్లు కమ్మేసి కనిపిస్తున్నాయి. అసలే వర్షాకాలం. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో పారిశుధ్య చర్యలు...
బూర్గంపహాడ్, ఆగస్టు 31 : బూర్గంపహాడ్ మండల కేంద్రంలో పారిశుధ్యం పడకేసింది. మేజర్ పంచాయతీలో ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం, డ్రైనేజీలను పిచ్చి చెట్లు కమ్మేసి కనిపిస్తున్నాయి. అసలే వర్షాకాలం. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో పారిశుధ్య చర్యలు ముమ్మరంగా చేపట్టాల్సిన పంచాయతీ అధికారులు పారిశుధ్యంపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలు బలంగా వినవస్తున్నాయి. కొన్ని వార్డుల్లో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి అడవిని తలపిస్తున్నాయి. డ్రైనేజీలో మురుగునీరు నిల్వ ఉండడంతో దోమలు వ్యాప్తి చెంది ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. బూర్గంపహాడ్ మేజర్ పంచాయతీలో సమస్యలపై సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి దృష్టి సారించి తక్షణమే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
పారిశుధ్య చర్యలు చేపట్టాలి : పున్నంచంద్, తెలంగాణ రైతుకూలీ సంఘం నాయకుడు
మేజర్ పంచాయతీలో పారిశుధ్యంపై పంచాయతీ అధికారులు దృష్టి సారించాలి. వార్డుల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. 7వ వార్డుతో పాటు కొన్ని వార్డుల్లో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. డ్రైనేజీల్లో మురుగునీటిని శుభ్రం చేసి దోమలను నివారించాలి. పారిశుధ్యం లోపించడంతో సమస్యకు సంబంధించి ప్రజావాణిలో సంబంధిత అధికారులకు సైతం వినతిపత్రం ఇచ్చాం. మేజర్ పంచాయతీలో సమస్యలను గుర్తించి పరిష్కరించాలి.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
Drinking Water | రాష్ట్రంలో మొదలైన తాగునీటి కష్టాలు.. ఈ దృశ్యాలు చూశారా..?
Jailer 2 | రజనీకాంత్ ‘జైలర్ 2’ అరుదైన రికార్డు.. రూ.800 కోట్ల దిశగా పరుగులు, నాలుగు రాష్ట్రాల్లో సరికొత్త చరిత్ర!
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

