సుందరయ్యనగర్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్
శాంతిభద్రతల పర్యవేక్షణ, నేరాల నియంత్రణ, అసాంఘీక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక సుందరయ్యనగర్‌లో పోలీసు శాఖ కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఎస్సీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు..
– సరైన పత్రాలు లేని 43 వాహనాలు స్వాధీనం
– పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్
బూర్గంపహాడ్, అక్టోబర్ 27 : శాంతిభద్రతల పర్యవేక్షణ, నేరాల నియంత్రణ, అసాంఘీక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక సుందరయ్యనగర్‌లో పోలీసు శాఖ కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఎస్సీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు మంగళవారం జరిగిన కార్డెన్ సెర్చ్ లో డాగ్ స్క్వాడ్ బృందాలతో విస్తృతంగా తనిఖీలు చేపట్టామని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, అసాంఘీక కార్యకలాపాలకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సరైన ధృవపత్రాలు లేని 43 ద్విచక్ర వాహనాలు, ఆటోలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అనుమానాస్పద వ్యక్తులు వాహనాల కదలికలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గంజాయి వినియోగం, అక్రమ రవాణా వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

సుందరయ్యనగర్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి అక్రమ రవాణా, లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని, ప్రజల సహకారంతోనే మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలను అరికట్టగలమని తెలిపారు. ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని డీఎస్సీ సూచించారు. శాంతిభద్రతల విషయంలో పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్డెన్ సెర్చ్ లో పాల్వంచ సీఐ సతీష్, ఎస్సైలు మేడా ప్రసాద్, నాగభిక్షం, రామ్మూర్తిలతో పాటు పలువురు ఎస్సైలు, స్పెషల్ పార్టీ సిబ్బంది, పోలీసు సిబ్బంది, డాగ్ స్క్వాడ్ సిబ్బంది 50 మంది వరకు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

