బూర్గంపహాడ్, మే 04 : బూర్గంపహాడ్ మండలంలో అక్రమ ఇసుక రవాణాపై జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపుదాడులు చేశారు. సోమవారం మండల పరిధిలోని పినపాక ఉప్పుసాక గ్రామాల మధ్య కిన్నెరసాని వాగు నుండి యధేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ బృందం రంగంలోకి దిగింది. టాస్క్ ఫోర్స్ సీఐ రమాకాంత్ ఆధ్వర్యంలో ఎస్ఐలు జలకం ప్రవీణ్, రామారావు సిబ్బందితో కలిసి ఒక లారీ, మూడు ట్రాక్టర్లు, రెండు జేసీబీలను పట్టుకుని 30 ట్రాక్టర్ల ఇసుకను అక్కడే సీజ్ చేసి వాహనాలను బూర్గంపహాడ్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆదివారం కూడా మండలంలో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి ఇసుకను అక్రమంగా తరలించే వాహనాలను పట్టుకున్నారు.