బూర్గంపహాడ్, జూన్ 01 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని మేజర్ పంచాయతీ సారపాక పరిధిలో ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు చేస్తున్న కూలీలకు సారపాక 10వ వార్డు సభ్యులు పాటి అశోక్ సోమవారం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి ఎండలో పని చేస్తున్నందుకు తనవంతుగా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఉపాధి కూలీలకు పనుల ప్రదేశం వద్ద అన్ని సదుపాయాలు కల్పించాలని, టెంట్లు, మంచినీటి సౌకర్యంతో పాటు ఎండ వేడిమిని తట్టుకునేలా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలని అధికారులకు సూచించారు.