ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని వినోభానగర్ గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను శనివారం ఏపీఓ రామారావు, గ్రామ సర్పంచ్ నవీన్ గంగావత్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
జూలూరుపాడు, మే 23 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని వినోభానగర్ గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను శనివారం ఏపీఓ రామారావు, గ్రామ సర్పంచ్ నవీన్ గంగావత్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు జరుగుతున్న తీరును, కూలీల హాజరును వారు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిపోయిందని, ఉష్ణోగ్రతలు సైతం రికార్డు స్థాయిలో 47 డిగ్రీలకు చేరుకుంటున్న తరుణంలో కూలీలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని వారు అన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా పనులకు వచ్చే కూలీలు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పని ప్రదేశంలో నీడ సౌకర్యం కల్పించుకోవాలని సూచించారు. వినోభానగర్ పంచాయతీ పరిధి నుండి ప్రతిరోజూ సుమారు 130 మంది కూలీలు ఈ పనులకు హాజరవుతున్నట్లు వారు తెలిపారు.
ఉపాధి కూలీలు ఎండదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉచితంగా చల్లటి మజ్జిగ, సురక్షిత మంచినీటి ప్యాకెట్లను ఏపీఓ రామారావు, సర్పంచ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ మండుటెండల్లో తమ ఇబ్బందులను గుర్తించి, సకాలంలో స్పందించి మజ్జిగ పంపిణీ చేయడం పట్ల ఉపాధి హామీ కూలీలు హర్షం వ్యక్తం చేశారు. తమ దాహార్తిని తీర్చినందుకు గాను సర్పంచ్ నవీన్ గంగావత్కు, ఉపాధి హామీ అధికారులకు కూలీలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, కూలీలు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

