ఐటీసీ కార్మికులకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో డ్రగ్స్ దుష్ప్రభావాలపై ఎస్ఐ మేడా ప్రసాద్ బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత, కార్మికులు మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని...
బూర్గంపహాడ్, జూన్ 24 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో డ్రగ్స్ దుష్ప్రభావాలపై ఎస్ఐ మేడా ప్రసాద్ బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత, కార్మికులు మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని, గంజాయి, డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉంటే కుటుంబాలు బాగుంటాయన్నారు. మత్తు పదార్ధాలతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయని, అంతేకాకుండా యువకులపై కేసులు నమోదైతే జీవితాంతం జైలు పాలు కావాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ మత్తు పదార్ధాలకు దూరంగా ఉండి మంచి నడవడికతో ముందుకు సాగాలని సూచించారు. గంజాయి సేవించినా, విక్రయించినా అలాంటి వారి సమాచారం పోలీసుస్టేషన్‌కు లేదా 100కు డయల్ చేసి తెలియచేయాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ అవగాహన సదస్సులో ఎస్ఐ నాగభిక్షం, ఎస్ఐ రామ్మూర్తి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

