డైరీ… నీకో నేస్తం
సాంకేతిక పెరుగుతున్నా చెక్కుచెదరని జ్ఞాపకాలను బంధీలుగా చేసే నేస్తమే డైరీ. కంప్యూటర్ యుగంలో కూడాఎన్నో జ్ఞాపకాలను గుర్తుంచుకునే అక్షరాలను దాచుకునే డైరీకి ఆదరణ తగ్గడం లేదు. చేతి రాతలు గుర్తుండేలా, ఉద్యోగులకు టూర్ డైరీగా, గమ్యాన్ని ముందే మేల్కొలిపే చేతిరాతల నేస్తం ప్రతీ ఒక్కరి డైరీ.
- తరతరాల జ్ఞాపకాల పుటలు
- గుర్తుగా ఇవ్వొచ్చు …గుర్తుంచుకునే రాతలు
- ప్రతీ ఇంట్లో అలమర్లలో నిక్షిప్తం
భద్రాద్రికొత్తగూడెం, డిసెంబర్ 31.(నమస్తేతెలంగాణ): సాంకేతిక పెరుగుతున్నా చెక్కుచెదరని జ్ఞాపకాలను బంధీలుగా చేసే నేస్తమే డైరీ. కంప్యూటర్ యుగంలో కూడాఎన్నో జ్ఞాపకాలను గుర్తుంచుకునే అక్షరాలను దాచుకునే డైరీకి ఆదరణ తగ్గడం లేదు. చేతి రాతలు గుర్తుండేలా, ఉద్యోగులకు టూర్ డైరీగా, గమ్యాన్ని ముందే మేల్కొలిపే చేతిరాతల నేస్తం ప్రతీ ఒక్కరి డైరీ. స్నేహితులకు గుర్తుండేలా ఇవ్వడమే కాక, గుర్తుంచుకునే రాతలు, జ్ఞాపకాలను దాచుకునేందుకు ఉపయోగపడే డైరీకి నేటికీ ఆదరణ తగ్గడం లేదు.
సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్నా, రాతలు గీతలకే పరిమితమైనా, జ్ఞాపకాలు మనసుల్లో దాచుకున్నా అలనాటి తీపి మాటలు, ఛలోక్తులు, చేతి రాతకు సరిపోవేమో. అలాంటి మధుర జ్ఞాపకాలను తలుపు తట్టి లేపేదే డైరీ.‘రాతలు ధరించేది కాగితం, బాధలు భరించేది జీవితం’ అన్న కవి డాక్టర్ సీ నారాయణరెడ్డి మాటలు అక్షర సత్యాలు. మన జీవితంలో అనేక మలుపులు, సంఘటనలను డైరీ తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. గడిచిన గత స్మృతులు తెలుసు కోవాలంటే వెంటనే డైరీని చూడాల్సిందే. నేడు చేపట్టిన, రేపు చేపట్టబోయే కార్యక్రమాలకు డైరీల్లో అక్షర రూపం ఇస్తాం. ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా డైరీ ఇచ్చిన తృప్తి లేదంటారు కొత్త ఏడాది వచ్చిందంటే చాలు మన నేస్తాలకు గుర్తుగా ఇచ్చేది డైరీనే. అలాంటి ఆ డైరీ కొత్త ఏడాది రాబోతున్న తరుణంలో వివిద రకాల డైరీలు మార్కెట్లో ప్రత్యక్షమవుతున్నాయి.
కొత్త ఏడాది కొత్త డైరీలు
నూతన సంవత్సరంలోకి అడిగుడుతున్న సందర్భంగా కొత్తడైరీలు కొనుగోలు చేసేందుకు అనేక మంది ఔత్సాహికులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటి వరకు డైరీ రాయడం అలవాటు లేనివారు కూడా ఈ నూతన సంవత్సరం నుంచి డైరీ రాయడం అలవాటు చేసుకోవడం మంచిదే… నిత్య జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని అందరితో పంచుకోలేం, అలాంటి అనుభూతులను డైరీలో భద్రపర్చుకుంటాం. ఆర్థిక లావాదేవీల నిర్వహణ, ఆత్మపరిశీలన, లోపాల సవరణ, వ్యక్తిగత బలహీనతల నుంచి బయటపడేందుకు అవకాశం కల్పించేదే డైరీ అని చెప్పవచ్చు. ప్రపంచంలోని అనేక మంది మహానీయుల జీవితానుభవాలను సమాజానికి పరిచయం చేయడంతో పాటు చిరస్థాయిగా గుర్తుంచుకొనేలా మలిచేది డైరీ ఒక్కటే.
డైరీ రాయడం చాలా మంచి అలవాటు
ముఖ్యమైన పనులను గుర్తు చేసేందుకు డైరీ చాలా ఉపయోగపడుతుంది. ముందస్తూ సమాచారం తెలుసుకునేందుకు మనం రాసుకున్న డైరీ మనకు ఉపయోగపడుతుంది. గతేడాది మనం చేసిన పనులు, వచ్చే నెలలో చేయాల్సిన పనులు గుర్తు చేసేందుకు ఈ డైరీ ఉపయోగపడుతుంది. చాలా కాలం క్రితం మనం రాసుకున్న రాతలు చూసి మనకే ఆశ్చర్యమేస్తుంది. ఎన్ని కంప్యూటర్లు వచ్చినా డైరీ విలువ దానికే ఉంటుంది. ముఖ్యంగా ఫోన్ నెంబర్లు సెల్లో డిలిట్ అయినా నంబర్లు గుర్తుగా డైరీలో దొరుకుతాయి.
– విద్యాలత, జడ్పీ సీఈవో, భద్రాద్రి జిల్లా
డైరీ రాయడం అలవాటు ఉంది
డైరీ రాయడం చాలా కాలంగా అలవాటైంది.. మన పని మనకు గుర్తు చేసేందుకు చాలా ఉపయోగపడుతుంది. ఉదయం లేవగానే ఒక సారి డైరీ చూసుకుంటే మనం ఎటు వెళ్లాలో డైరీనే చెబుతూ ఉంటుంది. మీటింగ్లకు వెళ్లి డైరీలో మినిట్స్ రాసుకుంటే వాటి గురించి అవగాహన కూడా ఉంటుంది. అందుకే చిన్నదైనా డైరీ ఉంటే తేదీల వారీగా రాసుకోవచ్చు. ఏవారంలో ఏ మీటింగ్లు ఉన్నాయి. మనం చేయాల్సింది ఏముంది అనేది స్పష్టత ఉంటుంది. మనకు టూర్ డైరీలు ఇలాంటి డైరీ వల్లే గుర్తు ఉంటుంది. ఏళ్ల నాటి డైరీలు నావద్ద ఉన్నాయి. వాటిని చూస్తే మనం అప్పట్లో విధులు ఏవిధంగా చేసామనేది గుర్తుంటుంది. చాలా మంది బంధువులు కూడా డైరీల ద్వారా గుర్తుకు వస్తారు.
– విజేత, జిల్లా సంక్షేమ అధికారి, భద్రాద్రి జిల్లా
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

