Kondapur |చిగురుమామిడి, ఆగస్టు 6 : హుస్నాబాద్ నుండి కొత్తపల్లి వరకు నాలుగు వరుసల రోడ్డు విస్తరణలో భాగంగా మండలంలోని కొండాపూర్ గ్రామంలో మిషన్ భగీరథ పైపులు పగిలిపోయింది. దీంతో గ్రామంలోని రెండు వార్డులకు నీటి సరఫరా మూర్తిగా నిలిచిపోవడంతో ఆయా వార్డులకు తాగునీరు రావడంలేదని మహిళలు ఖాళీ బిందెలతో హుస్నాబాద్ కరీంనగర్ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.
పలుమార్లు గ్రామ సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు, మిషన్ భగీరథ ఏఈ, సంబంధిత కాంట్రాక్టర్ కు తెలియజేపినప్పటికీ పట్టించుకోవడంలేదని, రోజు రోజుకు నీటి కొరత తీవ్రం కావడంతో తప్పని పరిస్థితిలో రోడ్డుపై నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్నారు. గ్రామస్తులు పూతరేణి శ్రీనివాస్, మల్లేశం, రాజు, లింగయ్య, ఐలయ్య మహిళలు పాల్గొన్నారు.