నేడే అర్బన్ బ్యాంకు ఎన్నికలు
సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు ఎన్నికలు గురువారం జరుగనున్నాయి. సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించే పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. 12 మంది డైరెక్టర్ స్థానాలకు ప్రత్యక్షంగా జరిగే ఎన్నికలకు 12 బూత్‌లు, మూడు జిల్లాలకు చెందిన 60 మంది సహకార సంస్థల సిబ్బందిని నియమించారు.
- ఉదయం 7నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్
- పోలింగ్ బూత్‌లు 12
- సిబ్బంది 60
రాజన్న సిరిసిల్ల, జూన్ 5 (నమస్తే తెలంగా ణ) : సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు ఎన్నికలు గురువారం జరుగనున్నాయి. సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించే పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. 12 మంది డైరెక్టర్ స్థానాలకు ప్రత్యక్షంగా జరిగే ఎన్నికలకు 12 బూత్‌లు, మూడు జిల్లాలకు చెందిన 60 మంది సహకార సంస్థల సిబ్బందిని నియమించారు. పోలింగ్ సందర్భంగా భారీ పోలీ స్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం 3గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. అర్బన్ బ్యాంకు పరిధిలో మొత్తం 6,171 మంది ఓటర్లున్నారు. అందులో పురుషులు 4,801, మహిళలు 1,376 మంది ఉన్నారు. ఇందుకోసం 12మంది పోలింగ్ అధికారులు, 15 మంది పీవోలు, 18 మంది ఏపీవోలను నియమించారు. ఎన్నికల సిబ్బందిని సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు చెందిన సహకార సిబ్బందిని కేటాయించారు.
బ్యాంకుకు ఎనిమిదోసారి ఎన్నికలు
అర్బన్ బ్యాంకు ఆవిర్భావం నుంచి నేడు జరుగుతున్న ఎన్నికలు 8వ సారి. అయిదేళ్ల గడువుతో పాలక వర్గాలు తమ పదవీ కాలాన్ని కొనసాగించాయి. ఇప్పటి వరకు ఏ డుగురు చైర్మన్లు పాలన కొనసాగించారు. సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట మండలాల్లో బ్యాంకు శాఖలున్నాయి. 12 మంది డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల అనంతరం డైరెక్టర్లంతా కలిసి చైర్మన్, వైస్చైర్మన్లను ఎన్నుకుంటారు. జాతీయ బ్యాంకులతో సమానంగా అభివృద్ధి చెందుతున్న బ్యాంకుకు ప్రతి అయిదేళ్లకోసారి జరుగుతున్న ఎన్నికల్లో కొత్త తరం పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నది. ఈసారి కూడ పెద్ద సంఖ్యలో కొత్త వాళ్లు రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు.
12 మందికి 61 మందిలో అత్యధిక శాతం నవతరం వాళ్లే పోటీలో నిలువడం విశేషం. కాగా బ్యాంకుపై జెండా ఎగుర వేసేందుకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు హోరాహోరీగా పోరాడుతున్నా యి. ఇప్పటికే 12మంది ప్యానెల్‌తో మూడు పార్టీలు విస్తృత ప్రచారం చేశాయి. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి తమ అభ్యర్థికి ఓటు వే యాలని అభ్యర్థిస్తున్నాయి. సిట్టింగ్ చైర్మన్ బీ ఆర్ఎస్ అభ్యర్థి కావడంతో మళ్లీ జెండా ఎగురవేసేందుకు పట్టు వదలకుండా ప్రయత్నాలు చేస్తున్నది. పట్టణ శాఖాధ్యక్షుడు జిందం చక్రపాణితోపాటు నాయకులు చీటి నర్సింగరావు, చిక్కాల రామారావు, గూడూరి ప్రవీణ్, బొల్లి రామ్మోహన్ కౌన్సిలర్లంతా కలిసి పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు నేడు సాయంత్రం 5 గంటల వరకు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

