ఉద్యాన రైతుకు ఉత్తచేయి!
రైతులపై చిన్నచూపు కనిపిస్తున్నది. రైతుబంధు వంటి వినూత్న పథకాన్ని పక్కన పెట్టిన ప్రస్తుత ప్రభుత్వం, కర్షకులకు ప్రయోజనం కలిగించే మరిన్ని కార్యక్రమాలను సైతం పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది.
- ఏటా ఉమ్మడి జిల్లాలో 125 ఎకరాలకు ప్రతిపాదన
- ఈ సారి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో ఆగిన ప్లాంటేషన్
- అగమ్య గోచరంలో ఉమ్మడి జిల్లా రైతులు
- అదును దాటిపోతున్నదని ఆందోళన
రైతులపై చిన్నచూపు కనిపిస్తున్నది. రైతుబంధు వంటి వినూత్న పథకాన్ని పక్కన పెట్టిన ప్రస్తుత ప్రభుత్వం, కర్షకులకు ప్రయోజనం కలిగించే మరిన్ని కార్యక్రమాలను సైతం పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది. అందుకు సిద్దిపేట జిల్లా ములుగు కేంద్రంగా ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఒక ఉదాహరణగా నిలుస్తున్నది. 2019 నుంచి ప్రతి సీజన్లో అక్కడ టమాటా, మిరప నారు పెంచి రైతులకు రాయితీపై ఇస్తుండగా.. ఈ సీజన్లో ప్లాంటేషన్ ఆగిపోయింది. దీంతో ఉద్యాన రైతుల్లో ఆందోళన కనిపిస్తున్నది.
..పక్క చిత్రంలో కనిపిస్తున్నది కరీంనగర్ మండలం గోపాల్‌పూర్‌కు చెందిన మంద తిరుపతి. కొన్నేళ్లుగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి టమాటా, మిరప నారును రాయితీపై తెచ్చి సాగు చేస్తున్నడు. ఆధునిక సాంకేతిక పద్ధతి, నాణ్యమైన మట్టిలో 40 రోజులపాటు పెంచిన మొక్కలను తెచ్చుకొనే తిరుపతికి ఇప్పుడు ఆశలు లేకుండా పోయాయి. షెడ్‌నెట్ నీడలో మంచి వాతావరణంలో పెంచిన మొక్కలు నాటినట్టయితే ఎక్కువ శాతం బతికేవని, మంచి దిగుబడి కూడా వచ్చేదని ఆయన చెబుతున్నడు. ఈ సారి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఎలాంటి మొక్కలు పెంచడం లేదని, ప్రైవేట్ నర్సరీల్లో మొక్కలు కొనే దుస్థితి వచ్చిందని వాపోతున్నడు.
కరీంనగర్, జూలై 13 (నమస్తే తెలంగాణ) : ఉద్యాన రైతులు సాగు చేసే కూరగాయలు, పండ్ల తోటల్లో కీలకమైన మొక్కలను నర్సరీల్లో పెంచి ఇచ్చే లక్ష్యంతో బీఆర్ఎస్ సర్కారు 2019లో సిద్దిపేట జిల్లా ములుగు, హైదరాబాద్ సమీపంలోని జీడిమెట్లలో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫ్రూట్స్’ని ఏర్పాటు చేసింది. ములుగులో 2019 డిసెంబర్ 11న తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దీనిని ప్రారంభించారు. కరీంనగర్, మెదక్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లోని ఉత్సాహవంతులైన ఉద్యాన రైతులకు ఇక్కడ టమాటా, మిరప నారు పెంచి అందిస్తున్నారు.
ప్రతి సీజన్‌కు 40 రోజుల ముందే ఆయా జిల్లాల ఉద్యాన శాఖ అ ధికారులు రైతులను గుర్తించి, వారికి ఏ పంట నారు ఎంత అవసరమో..? సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధికారులకు నివేదిస్తారు. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఒక ఎకరానికి సరిపడా నారు పెంచితే 8 వేల వరకు ఖర్చు వస్తున్నా.. రైతులకు మా త్రం రాయితీపై అందిస్తారు. ఎకరాకు సరిపడే మిరప నారుకు 1,280, టమాటా నారుకు 1,500 తీసుకుని అందిస్తారు. ఆధునిక సాంకేతిక పద్ధతిలో పెంచే ఈ నారు సాగు చేయడం వల్ల ఆశించిన దిగుబడి వస్తుండగా, ఏటేటా ఇక్కడి నారును తీసుకునే రైతులు పెరుగుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 125 ఎకరాలు
ఉద్యాన పంటలకు నిలయంగా మారుతున్న ఉమ్మడి జిల్లా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. రెండేళ్లుగా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ నుంచి తమకు కావాల్సిన నారు తెచ్చుకుంటున్నారు. ఈ వానకాలం సీజన్ చూస్తే.. కరీంనగర్లో 32.5, పెద్దపల్లిలో 35, సిరిసిల్లలో 32.5, జగిత్యాలలో 25 ఎకరాల చొప్పున మొత్తం 125 ఎకరాలకు ఆయా జిల్లాల ఉద్యాన శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు.
అదే విధంగా మిగతా జిల్లాల నుంచి కూడా ప్రతిపాదనలు పంపించారు. రైతు ల అవసరాలను బట్టి మే నెలాఖరులోనో.. జూన్ మొదటి వారంలోనో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధికారులు నారు పెంచే ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. జూలై మొదటి, రెండో వారాల్లో రైతులు తెచ్చుకొని సాగు చేసుకునే అవకాశం ఉండేది. కానీ, ఇంత వరకు అక్కడి అధికారులు నారు పోసే ప్రక్రియను ప్రారంభించక పోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. టమాటా, మిరప నారు ఎందుకు పోయడం లేదని అడిగే ప్రయత్నం చేస్తే.. సరైన సమాధానం చెప్పే అధికారులు కూడా కరువయ్యారు.
ప్రైవేట్ నర్సరీలవైపు..
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్లాంటేషన్ చేసి ఇస్తారనుకొని రైతులు సొంతంగా నారు పోసుకోవాలనే ఆలోచన చేయలేదు. ముఖ్యంగా ఉద్యానశాఖ అధికారులు తమకు నారు పెంచి ఇస్తారనే నమ్మకంతో ఈ ప్రయత్నమే చేయలేదు. ఫలితంగా ఇప్పుడు పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. సాగుకు అదును దాటుతుండడంతో ప్రైవేట్ నర్సరీలను ఆశ్రయించాల్సి వస్తున్నది. తీరా అక్కడికి వెళ్లి మొక్కలు కొనే ప్రయత్నం చేస్తే అడ్డగోలుగా ధర పెట్టాల్సి వస్తున్నదని రైతులు చెబుతున్నారు.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఎకరా టమాటా నారుకు 1,500, మిరప నారుకు 1,280 చెల్లిస్తే సరిపోయేదని, ఇప్పుడు ప్రైవేట్ నర్సరీ నుంచి తెచ్చుకోవాలంటే ఎకరా నారుకు 10 వేల నుంచి 12 వేలు ఖర్చు చేయాల్సి వస్తున్నదని వాపోతున్నారు. ఇంత పెద్ద మొత్తం లో ఖర్చు చేసే పరిస్థితి లేక ఎంతో మంది సాగు చేయకుండానే వదిలేస్తున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగానే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్లాంటేషన్ చేపట్టాలని కోరుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

