Panchayat Secretaries Association | మొదటి తప్పుగా భావించి విధుల్లోకి తీసుకోవాలి.. పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోతో ఫేస్ రికగ్నైజేశన్ యాప్ లో హాజరు వేసుకున్నారనే ఆరోపణతో బుగ్గారం మండలం చందయపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయగా పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు.
- ఒకరికే రెండు గ్రామాల్లో విధులు నిర్వహించడం వల్లే ఈ తప్పిదమని వెల్లడి
Panchayat Secretaries Association | జగిత్యాల, ఆగస్టు 4 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోతో ఫేస్ రికగ్నైజేశన్ యాప్ లో హాజరు వేసుకున్నారనే ఆరోపణతో బుగ్గారం మండలం చందయపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయగా పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ సస్పెన్షన్ కు గురైన పంచాయతీ కార్యదర్శి రాజన్న కు మరో గ్రామ పంచాయతీ అయిన సిరికొండ కు కూడా ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఆ సమయంలో చందయ్య పల్లిలో నిర్ణీత సమయం లోగా అటెండెన్స్ వేయాల్సి ఉండగా అక్కడి గ్రామ సహాయకునికి అటెండెన్స్ వేయమని చెప్పడం వల్ల ఈ పొరపాటు జరిగిందని, ఇది కావాలని చేసిన పొరపాటు కాదని, మొదటి తప్పుగా భావించి పంచాయతీ కార్యదర్శిని విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
జూలై 1, 2 తేదీలల్లో సిరికొండలో విధుల్లో హాజరైన రాజన్న తన సహాయకుడికి చందయ్యపల్లిలో అటెండెన్స్ వేయమని చెప్పడం వల్ల అతనికి ఫేస్ రికగ్నేషన్ యాప్ పై అవగాహన లేకపోవడంతో పొరపాటున ముఖ్యమంత్రి ఫొటో అప్లోడ్ అయిందని వివరణ ఇచ్చారు. గత 18 నెలలుగా గ్రామపంచాయతీలకు కేంద్ర నిధులు గాని, రాష్ట్ర నిధులు గాని రాకపోయినప్పటికీ తమ సొంత డబ్బులతో గ్రామ పంచాయతీకి సంబంధించిన అత్యవసర సేవలను అందిస్తున్నామని, గత ఆరు నెలల జీతం కూడా తమకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తాము ఖర్చుపెట్టిన బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులు, పని భారం, ఒత్తిడితో పంచాయతీ కార్యదర్శులు ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా 98 శాతం మంది కార్యదర్శులు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారని ఎవరో కొంతమంది చేసిన తప్పిదానికి పంచాయతీ కార్యదర్శుల వ్యవస్థను తప్పు పట్టడం సమంజసం కాదన్నారు. గ్రామపంచాయతీ విధులతోపాటు అదనపు పనుల వల్ల కూడా పంచాయతీ కార్యదర్శులు మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా బాధ్యులు శ్రీకాంత్, సతీష్ కుమార్, రాజు, రవి తోపాటు జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

