Ponnam Prabhakar | రైతులకు అండగా నిలువ లేని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలి.. చిగురుమామిడి బీఆర్ఎస్ నాయకుల డిమాండ్
వరి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మామిడి అంజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్ను పలువురు నాయకులు సోమవారం పరిశీలించి, రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Ponnam Prabhakar | చిగురుమామిడి, నవంబర్ 16 : వరి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మామిడి అంజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్ను పలువురు నాయకులు సోమవారం పరిశీలించి, రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరి కోతలు మొదలై నెల కావస్తున్న కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల ముందే దళారులు యథేచ్ఛగా తూకాలు వేస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాకాలోనే దళారుల హవా నడుస్తుండటం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు.
రైతులకు అండగా నిలువలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని, వెంటనే కొనుగోలు కేంద్రాలను సజావుగా నడపాలని, దళారుల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు హనుమండ్ల సత్యనారాయణ, ప్రచార కార్యదర్శి బెజ్జంకి రాంబాబు, గ్రామ శాఖ అధ్యక్షులు కాశబోయిన రాజు యాదవ్, కత్తుల రమేష్, బుర్ర తిరుపతి, కలువల సంపత్ రెడ్డి, మాజీ సర్పంచ్లు సన్నిల్ల వెంకటేష్, బెజ్జంకి లక్ష్మణ్, సర్వర్ పాషా, దేశిని రాజయ్య, దొనపాటి కృష్ణారెడ్డి, చిరంజీవి, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పోక్సో చట్టం, బాలల హక్కులపై విద్యార్థినులకు అవగాహన
‘కేఓసీ హెచ్డీ ఓబీలో పాత కార్మికులకే ఉపాధి కల్పించాలి’
Amitabh Bachchan | ‘బతికి బయటపడ్డాం’.. అమితాబ్ బచ్చన్ సంచలన పోస్ట్,అసలేం జరిగింది?
AP News | దారుణం.. అప్పు చెల్లించలేదని తల్లిని, ఆరు నెలల బిడ్డను ఎత్తుకెళ్లిన వడ్డీ వ్యాపారి..!
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి

