KTR | సోమవారం సిరిసిల్లలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం.. హాజరుకానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్లలోని శ్రీ శాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం సోమవారం కన్నుల పండుగగా జరగనుంది. 800 ఏండ్ల చరిత్ర గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యాయి.
KTR | రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్లలోని శ్రీ శాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం సోమవారం కన్నుల పండుగగా జరగనుంది. 800 ఏండ్ల చరిత్ర గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేష్ లోని తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాల మాదిరిగానే అదే ముహూర్తాన సిరిసిల్లలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ స్వామి వారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అనవాయితీగా వస్తుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం జరిగే రథోత్సవంలో శ్రీ స్వామివారు పురవీధులుగుండా రథంపై ఊరేగి భక్తులకు
దర్శనమివ్వనున్నారు. ప్రతీయేటా బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే రథోత్సవం అంత్యంత వైభవంగా నిర్వహిస్తారు. సుమారు లక్ష మంది వరకు భక్తులు హాజరు కానున్నారు. రథోత్సవానికి విచ్చేసే భక్తుల కోసం ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో మారుతీరావు పేర్కొన్నారు.
వెంకన్న రథోత్సవానికి రామన్న
శ్రీ శాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి రథోత్సవానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. ఇటీవలే ఆలయ ఈవో మారుతీరావుతో పాటు కమిటీ నిర్వహాకులు కేటీఆర్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. సోమవారం జరిగే రథోత్సవానికి కేటీఆర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. కేటీఆర్ రానున్న నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, పార్టీ శ్రేణులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా గంభీరావుపేట మండలం లింగన్నపేట లోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కానున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- BRS
- Chariot Festival
- Karimnagar
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
10 voters listed as Same Name | యూపీలో ‘వికాస్ యాదవ్’ పేరుతో 10 మంది ఓటర్లు.. 9 మంది అధికారులపై చర్యలు
PV Sindhu | ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి.. టైటిల్ గెలుచుకున్న వరల్డ్ నెంబర్ వన్ అన్ సె యంగ్
KTR | రాహుల్‌గాంధీకి తెలంగాణ ఒక ఏటీఎంగా మారింది : కేటీఆర్
Health Tips | ఇంట్లో నాఫ్తలీన్ బాల్స్ వాడుతున్నారా..? అయితే ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవాల్సిందే..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

