Godavarikhani | గోదావరిఖనిలో ఉద్యమకారులు, కార్మికుల సంక్షేమం కోసమే తిరిగి బీఆర్ఎస్లో చేరిక
తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం పోరాడిన తోడేటి శంకర్ గౌడ్, ఆయన సతీమణి స్వరూప, తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకుడు మద్దెల శ్రీనివాస్ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గోదావరిఖని పట్టణంలోని విజయమ్మ నిలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
- కేసీఆర్ నాయకత్వంపై నమ్మకంతో సొంత గూటికి చేరిన తోడేటి శంకర్ గౌడ్, స్వరూప, మద్దెల శ్రీనివాస్
- విజయమ్మ నిలయంలో చేరిక కార్యక్రమం.. స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
Godavarikhani | గోదావరిఖని : తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం పోరాడిన తోడేటి శంకర్ గౌడ్, ఆయన సతీమణి స్వరూప, తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకుడు మద్దెల శ్రీనివాస్ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గోదావరిఖని పట్టణంలోని విజయమ్మ నిలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు న్యాయం జరగాలనే లక్ష్యంతో తోడేటి శంకర్ గౌడ్ అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఉద్యమకారుల కోసం మరో రాజకీయ పార్టీ ప్రారంభమైన సమయంలో అందులో కొంతకాలం పనిచేసినప్పటికీ, కేసీఆర్ నాయకత్వంలోనే ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందనే విశ్వాసంతో తిరిగి బీఆర్ఎస్లో చేరారని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ నాయకత్వంపై నమ్మకంతో శంకర్ గౌడ్, స్వరూప, మద్దెల శ్రీనివాస్ తిరిగి పార్టీలోకి రావడం సంతోషకరమన్నారు. ఈ ప్రాంతంలోని ఉద్యమకారులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వారితో కలిసి పనిచేస్తామని తెలిపారు. మద్దెల శ్రీనివాస్ గతంలో తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు చేశారని చందర్ గుర్తుచేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కార్మికులకు ఆశించిన స్థాయిలో న్యాయం జరగడం లేదని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ శంకర్ గౌడ్, స్వరూప, శ్రీనివాస్‌లు ఉద్యమ కార్యక్రమాలతో పాటు ప్రజలకు సేవలందించారని తెలిపారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి, ఉద్యమకారులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి వారంతా కలిసి పనిచేస్తారని పేర్కొన్నారు. గతంలో ఈ ప్రాంతంలో గులాబీ జెండా ఎగిరిందని, భవిష్యత్తులోనూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని చందర్ తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో రామగుండం ప్రాంతంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం పనిచేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్, బీఆర్ఎస్ నాయకులు బొడ్డు రవీందర్, నారాయణదాసు మారుతి, మెతుకు దేవరాజ్, నూతి తిరుపతి, దొమ్మేటి వాసు, అచ్చే వేణు, కనకరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- BRS
- Godavarikhani
- KCR
- Koppula Eswar
RELATED ARTICLES
తాజా వార్తలు
Piyush Goyal | భారత్-అమెరికా ట్రేడ్ డీల్ తుదిదశకు చేరింది : పీయూష్ గోయెల్
Murder | పాతబస్తీలో కార్ల వ్యాపారి దారుణ హత్య..నిందితుడి కోసం గాలింపు
Dhadkan | బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ధడ్కన్’కు సీక్వెల్.. కొత్త తారాగణంతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మేకర్స్!
TTD | వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లు, టోకెన్లు విడుదల తేదీని ప్రకటించిన టీటీడీ
Laxma Reddy | జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

