రాజన్నను దర్శించుకోవడం నా అదృష్టం
‘మా అత్తగారిది మొదట కరీంనగరే. ఇప్పుడు ఆదిలాబాద్‌లో ఉంటున్నరు. వాళ్ల కులదైవం వేములవాడ రాజేశ్వరస్వామి. చాలాసార్లు విన్నా కానీ, మొదటిసారిగా రాజన్నను దర్శించుకోవడం నా అదృష్టం’ అని వర్ధమాన సినీనటుడు రామకృష్ణ ముత్యాల అలియాస్ శత్రు అన్నారు.
- తెలుగు ప్రజలు ఆత్మీయతకు ప్రతిరూపం
- మా అత్తగారిది మొదట కరీంనగరే
- సినిమాల్లో నటించాలనే కోరికతో ఒడిశా నుంచి హైదరాబాద్ వచ్చా
- కృష్ణగాడి వీర ప్రేమగాథ బ్రేక్‌నిచ్చింది
- ఏడు సంవత్సరాల్లో 30కి పైగా సినిమాలు చేసిన
- ‘నమస్తే తెలంగాణ’తో ప్రముఖ సినీనటుడు రామకృష్ణ ముత్యాల అలియాస్ శత్రు
- కుటుంబసభ్యులతో కలిసి వేములవాడ, కొండగట్టులో పూజలు
వేములవాడ, ఫిబ్రవరి 3:‘మా అత్తగారిది మొదట కరీంనగరే. ఇప్పుడు ఆదిలాబాద్‌లో ఉంటున్నరు. వాళ్ల కులదైవం వేములవాడ రాజేశ్వరస్వామి. చాలాసార్లు విన్నా కానీ, మొదటిసారిగా రాజన్నను దర్శించుకోవడం నా అదృష్టం’ అని వర్ధమాన సినీనటుడు రామకృష్ణ ముత్యాల అలియాస్ శత్రు అన్నారు. తాను పుట్టి పెరిగింది ఒడిశా అయినప్పటికీ తెలుగు సినిమాల్లో నటించాలన్న బలమైన కోరికతో హైదరాబాద్ వచ్చానని చెప్పారు. తెలుగు ఇండస్ట్రీ ఆదరించిన తీరు ఎన్నటికీ మరువలేనని, తెలుగు ప్రజలు ఆత్మీయతకు ప్రతిరూపమని చెప్పారు. శుక్రవారం తన సతీమణి వినూత్నతో కలిసి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అతిథిగృహంలో ‘నమస్తే తెలంగాణ’కు ఇంటర్య్యూ ఇచ్చారు. –
నమస్తే తెలంగాణ : మీ ఫ్యామిలీ గురించి?
నటుడు శత్రు : మాది ఒడిశా రాష్ట్రంలోని సంబల్పూర్. మమ్మీ సరోజనిదేవి, డాడీ సత్యనారాయణ. పూర్తిగా వ్యవసాయ కుటుంబం. మేం ముగ్గురు కొడుకులం. నేను చిన్నోడిని. ఇద్దరు అన్నలు అక్కడే ఉన్నరు. ఒక అన్న అగ్రికల్చర్ చేస్తడు. మరో అన్న ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నడు. మా డాడీ 2017లో చనిపోయారు. మా అత్తగారి ఇల్లు కరీంనగర్ అయినప్పటికీ ప్రస్తుతం ఆదిలాబాద్జిల్లాలో ఉంటున్నరు. తెలుగు ప్రజల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మీయతకు ప్రతిరూపం.
నమస్తే: సినీ ప్రస్థానం ఎలా మొదలైంది?
శత్రు: నేను ఇంటర్ వరకు ఒడిశాలోనే చదివిన. డిగ్రీ కోసం హైద్రాబాద్ వచ్చిన. మైక్రో బయోలజీలో డిగ్రీ పూర్తి చేసిన. నాకు మొదటి నుంచి సినిమాల్లో నటించాలని కోరిక ఉండేది. అందులో భాగంగానే హైద్రాబాద్‌లో డిగ్రీ చేస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నం చేసిన. పదేళ్ల క్రితం మొదటగా లీడర్ సినిమాలో చిన్న రోల్ చేసిన. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా నాకు మంచి పేరు తెచ్చింది. హీరోయిన్ సోదరుడిగా నటించిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. పుష్ప సినిమాలో మంచి పాత్ర నాకు దక్కడం అదృష్టం. డీఎస్పీ గోవిందప్పగా సినిమాలో ఫుల్‌రోల్ చేసిన. నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్‌ను ఎప్పటికీ జీవితంలో మరిచిపోలేను.
నమస్తే : ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించారు?
శత్రు: నేను ఇప్పటి వరకు దాదాపు 30కిపైగా సినిమాలు చేసిన. మొదట్లో పెద్దగా గుర్తింపు రాలేదు. ఏడు సంవత్సరాల నుంచి మంచి అవకాశాలు వస్తున్నయ్. మహేశ్‌బాబు, రామ్‌చరణ్, ఎన్టీఆర్ సినిమాల్లో నటించిన. ప్రస్తుతం ప్రధానంగా నాలుగు సినిమాల్లో నటిస్తున్న. పుష్ప-2, ఖుషీ, చంద్రముఖి, ఉగ్రంతోపాటు అనేక చిన్న సినిమాల్లో కూడా నటిస్తున్న. ఇటీవల వచ్చిన కొరమీనులో సినిమాలో మీసాల రాజుగా నటించిన.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

