Sircilla | సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 12 : సిరిసిల్ల మున్సిపల్ కౌంటింగ్ కేంద్రంలో విచిత్ర సన్నివేశం నెలకొంది. స్థానిక సినారె కళామందిరంలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రంలో కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో అధికారులు కౌంటింగ్ కేంద్రం పరిసరాలలో కొండెంగ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
కౌంటింగ్ కేంద్రం ఆవరణలో కోతులు రావడంతో అధికారులు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. దీంతో సమస్య పరిష్కారం కోసం కొండెంగ చిత్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.