పెద్దపల్లి ఫిబ్రవరి 4 : ఆడిట్ అభ్యంతరాల పై వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు.
స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలో పెండింగ్లో ఉన్న ఆడిట్ అభ్యంతరాల పరిష్కారంపై కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. 2014-15 నుంచి పెండింగ్లో ఉన్న ఆడిట్ అభ్యంతరాల పరిష్కారం దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
గ్రామ పంచాయతీలు 7 రోజుల్లో ఆడిట్ అభ్యంతరాల పై సమాధానం రాతపూర్వకంగా జిల్లా పంచాయతీ అధికారికి అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ జయ శ్రీ ,జిల్లా ఆడిట్ ఆధికారి యం సురేష్ బాబు, సహాయ ఆడిట్ ఆధికారి యన్ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.