Panchayat elections | సజావుగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ.. సాధారణ ఎన్నికల పరిశీలకుడు అనుగు నర్సింహా రెడ్డి
పెద్దపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు కృషి చేయాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు అనుగు నర్సింహా రెడ్డి సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్లు దాసరి వేణు, జల్ద అరుణ శ్రీ, డీసీపీ రాంరెడ్డితో కలిసి ఆయన పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో ఆదివారం సమావేశమయ్యారు.
Panchayat elections | పెద్దపల్లి, నవంబర్ 30 : పెద్దపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు కృషి చేయాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు అనుగు నర్సింహా రెడ్డి సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్లు దాసరి వేణు, జల్ద అరుణ శ్రీ, డీసీపీ రాంరెడ్డితో కలిసి ఆయన పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో ఆదివారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఎంసీసీ అమలులో ఎటువంటి నిర్లక్ష్యం చేయరాదన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే ప్రతీ సిబ్బంది తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలన్నారు. పోలింగ్కు రెండు రోజుల ముందు వైన్ షాప్స్ మూసి వేయించాలన్నారు. అభ్యర్థులు వినూత్న రీతిలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తారని, దానిని నియంత్రించటానికి నిఘా పెట్టాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఎన్నికల ప్రచారంలో భాగస్వామ్యం కావద్దని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మొదటి విడతలో డిసెంబర్ 11న 99 గ్రామాలు, 896 వార్డులు, రెండో విడతలో డిసెంబర్ 14న 73 గ్రామాలు, 684 వార్డులు, మూడో విడతలో డిసెంబర్ 17న 91 గ్రామాలు, 852 వార్డులకు ఎన్నికల జరుగుతాయని వెల్లడించారు. మొదటి విడత జరిగే 99 గ్రామ పంచాయతీలకు 823 నామినేషన్ స్వీకరించామని, రెండో విడత నోటిఫికేషన్ విడుదల చేశామని, నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, 24 గంటలు పని చేస్తుందని పేర్కొన్నారు. కులాలు మతాలను రెచ్చగొట్టే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే రికార్డు చేసి నిబంధనలను ప్రకారం వారిని పోటీ నుంచి తొలగించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

