Palakurthi | పాలకుర్తి : జగిత్యాలలో జరగనున్న కేసీఆర్ భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అల్ట్రాటెక్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షుడు కౌశిక హరి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు సోమవారం భారీగా తరలి వెళ్లారు. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ కాంట్రాక్టు కార్మికులు, చుట్టూ పక్క గ్రామాలలో నాయకులు కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా కౌశిక హరి మాట్లాడుతూ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరడం శుభపరిణామమన్నారు.
జగిత్యాలకు తరలివెళ్లిన వారిలో నాయకులు మద్దికుంట శంకర్, నిమ్మరాజుల రవి, ధరంగుల కుమార్, కోదాటి ప్రవీణ్ కుమార్, అల్ట్రాటెక్ కాంట్రాక్ట్ కార్మిక ప్రధాన కార్యదర్శి మాదాసు శ్రీనివాస్, కార్మిక వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తిని సతీష్, కండే స్వామి, ప్లాయస్ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దపల్లి నాగరాజ్, ముల్కనూరి శ్రీధర్, మేకల శ్రీనివాస్ యాదవ్, గౌస్ బాబా, ఆకుల కొమురయ్య, ముత్యం లక్ష్మణ్, బాలసాని నరేష్, అసం హేమంత్ సాగర్, నవీన్ యాదవ్, జీబర్దస్త్ శ్రీకాంత్, వార్డు సభ్యులు సంకరి కుమార్‌తోపాటు పలువురు నాయకులు ఉన్నారు.