కరీంనగర్ డివిజన్ల పునర్విభజనకు నోటిఫికేషన్
మున్సిపల్ ఎన్నికలకు త్వరలోనే నగరా మోగనున్న నేపథ్యంలో పట్టణాలు, నగరాల్లో విలీన గ్రామాలకు సంబంధించి డివిజన్లు, వార్డుల పునర్విభజనకు రాష్ట్ర సర్కారు సోమవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
- ఈ నెల 4న ముసాయిదా
- 21న ఫైనల్ జాబితా
- వివిధ పార్టీల నాయకుల్లో జోరుగా చర్చ
కార్పొరేషన్, జూన్ 2: మున్సిపల్ ఎన్నికలకు త్వరలోనే నగరా మోగనున్న నేపథ్యంలో పట్టణాలు, నగరాల్లో విలీన గ్రామాలకు సంబంధించి డివిజన్లు, వార్డుల పునర్విభజనకు రాష్ట్ర సర్కారు సోమవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ మేరకు ఈ నెల 3న డివిజన్ల విభజనకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సి ఉంటుంది. 4న ముసాయిదా జాబితాను పత్రికల్లోనూ ప్రచురించాల్సి ఉంటుంది. 5 నుంచి 11 వరకు అభ్యంతరాలు, నివేదికలు స్వీకరించాలి. 12 నుంచి 16 వరకు అభ్యంతరాలను పరిశీలించాల్సి ఉంటుంది. 17, 18 తేదీల్లో డివిజన్ల విభజన పత్రాలకు కలెక్టర్ అనుమతి తీసుకోవాలి. 19న ముసాయిదా జాబితాను సీడీఎంఎకు పంపించాలి. 20న సీడీఎంఏ నుంచి ప్రభుత్వానికి నివేదికను పంపించి, 21న ఫైనల్ డివిజన్ల జాబితాను విడుదల చేస్తారు.
మొదలైన చర్చలు
కరీం‘నగరం’ సమీపంలో కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు మల్కాపూర్, చింతకుంట, గోపాల్పూర్, దుర్శేడ్, బొమ్మకల్ గ్రామాలను కలుపుతూ ప్రస్తుతం ఉన్న 60 డివిజన్లను 66కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు నగరపాలక అధికారులు 66 డివిజన్లకు సంబంధించి గతంలోని ఓటరు జాబితాను అనుసరించి డివిజన్ల విభజనను పూర్తి చేసి సీడీఎంఏకు పంపినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఒక జాబితా కూడా గతంలోనే సోషల్ మీడియాల్లో చక్కర్లు కొట్టింది. అప్పటి నుంచే కార్పొరేషన్‌లోని వివిధ పార్టీల నాయకుల్లో డివిజన్ల విభజనపై ప్రత్యేక ఆసక్తి నెలకొన్నది.
ఎవరికివారే తమ డివిజన్ల విభజన ఎలా జరిగింది? ఏయే కాలనీల ఓట్లు ఏయే ప్రాంతాల్లో కలిపారన్న చర్చలు సాగాయి. ప్రతి డివిజన్‌కు 4500 నుంచి 5500 ఓటర్లు ఉండేలా అధికారులు డివిజన్లను విభజించినట్లు తెలుస్తుండగా, అయితే పలు డివిజన్లల్లో దూర ప్రాంతాలకు చెందిన ఇండ్లను చేర్చినట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలకు సంబంధించి ఫిర్యాదులు, తమ అభ్యంతరాలు తెలిపేందుకు ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నాయకులు సిద్ధమయ్యారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

