National Award | మేజిక్ రాజాకు జాతీయ అవార్డు
గోదావరిఖనికి చెందిన ప్రముఖ ఇంద్రజాలికులు, బహుముఖ ప్రజ్ఞాశాలి మేజిక్ రాజాకు ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డు లభించింది. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ లో డాక్టర్ బీవీ పట్టాభిరామ్ స్మారక జాతీయ పురస్కార్- 2026 కార్యక్రమం నిర్వహించారు.
National Award | కోల్ సిటీ, అక్టోబర్ 9 : గోదావరిఖనికి చెందిన ప్రముఖ ఇంద్రజాలికులు, బహుముఖ ప్రజ్ఞాశాలి మేజిక్ రాజాకు ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డు లభించింది. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ లో డాక్టర్ బీవీ పట్టాభిరామ్ స్మారక జాతీయ పురస్కార్- 2026 కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మేజిక్ రాజాను అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, చీఫ్ కో- ఆర్డినేటర్ డాక్టర్ ఎం.ఏ కరీంతోపాటు అతిథులు ప్రతిష్టాత్మక బెస్ట్ మైండ్ పవర్ మోటివేషనల్ స్పీకర్ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. కాగా, మేజిక్ రాజా సీనియర్ ఇంద్రజాలికుడే గాకుండా మిమిక్రీ, మైమ్, వెంట్రిలాక్విజం కళాకారుడిగా, సహజ నటుడిగా, వ్యాఖ్యాతగా, న్యూస్ రీడర్ గా , మోటివేషనల్ స్పీకర్ గా విశిష్ట ప్రతిభ కనబర్చడం అద్భుతమని కొనియాడారు. అనంతరం మేజిక్ రాజా మాట్లాడే బొమ్మతో చేసిన ప్రదర్శన సభికులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో ప్రముఖ మానసిక నిపుణులు, మెజీషియన్లు, కళాకారులు పాల్గొన్నారు. కాగా జాతీయ అవార్డు అందుకున్న మేజిక్ రాజాను ఉమ్మడి జిల్లా మెజీషియన్ అసోసియేషన్ అధ్యక్షుడు, స్థానిక కళాకారులు, స్మైల్ ప్లీజ్ సీనియర్ సభ్యులు అభినందించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రజల వద్దకే పాలన కోసం జిల్లాలు ఏర్పాటు : గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
Wife Stabs Husband’s Private Part | వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. భర్త ప్రైవేట్ భాగంపై కత్తితో భార్య దాడి
పోలీస్ ఉద్యోగార్థులకు బుసిరెడ్డి ఫౌండేషన్ చేయూత
Protein Vs Fiber | బరువు తగ్గాలంటే ప్రొటీనా? ఫైబరా? అసలు నిజం ఇదే!
Toxic | యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. రూ.200 కోట్ల ఓటీటీ డీల్‌పై నీలినీడలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

