పెద్దపల్లి రూరల్ : పెద్దపల్లి రూరల్ ఎస్సైగా ఎన్ మధూకర్ ( SI Madhukar ) బాధ్యతలు చేపట్టారు. రామగుండం కమీషనరేట్ పరిధిలో వేకెన్సీ రిజర్వ్‌లో ఉన్న మధూకర్ ను పెద్దపల్లి రూరల్‌కు నియమించారు. ఇక్కడ పని చేసిన బుద్దె మల్లేష్‌ను జూలపల్లి ఎస్సైగా బదిలీ చేశారు. ఈ మేరకు బుధవారం మధూకర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మహిళా ఎస్సై శ్వేత, ఏఎస్సై తిరుపతి, అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు.