రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
వేములవాడ పట్టణంతోపాటు రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న ఆలయం, వేములవాడలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఆలయ ఈవో రామకృష్ణ, అధికారులతో కలిసి రాజన్న ఆలయ సమావేశ మందిరంలో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
- అభివృద్ధి పనులపై కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, అధికారులతో సమీక్షా సమావేశం
వేములవాడ, జూన్23: వేములవాడ పట్టణంతోపాటు రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న ఆలయం, వేములవాడలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఆలయ ఈవో రామకృష్ణ, అధికారులతో కలిసి రాజన్న ఆలయ సమావేశ మందిరంలో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకు ముందు స్వామివారిని దర్శించుకుని మాట్లాడారు.
గతంలో సమీక్షించిన పనులను త్వరగా మొదలుపెట్టి పూర్తి చేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు. భక్తులకు బ్రేక్ దర్శనం ఏర్పాట్లను మొదలుపెట్టాలని, ఇందుకోసం పనులు పూర్తి చేయాలని సూచించారు. రాజన్న కోడెల సంరక్షణ కోసం ప్రత్యేక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని ఆదేశించారు. వందలాది కోడెల సంరక్షణ కోసం ఆధునిక పద్ధతుల్లో షెడ్లు నిర్మించాలని ఆదేశించారు. అలాగే గోశాల మొత్తం ఫ్లోరింగ్ సీసీ చేయించాలని, కోడెలు, గోవులకు దాన, పచ్చిగడ్డి పెట్టాలని విప్ సూచించారు.
గుడి చెరువును ఆహ్లాదంగా తీర్చిదిద్దాలి
వేములవాడ గుడి చెరువును ఆహ్లాదంగా తీర్చిదిద్దాలని విప్ ఆది శ్రీనివాస్ ఆదేశించారు. టూరిజంశాఖ ఆధ్వర్యంలో ఆలయ చెరువు ఆవరణలోని బండ్పార్లో కొనసాగుతున్న నిర్మాణాలను కలెక్టర్‌తో కలిసి ఆయ న పరిశీలించారు. పార్, ఇతర నిర్మాణాలను క్షేత్రస్థాయిలో తనిఖీచేశారు. పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నటరాజ విగ్రహం ఏర్పాటు పను లు పూర్తయ్యాయని అధికారులు వారికి చెప్పా రు. అలాగే రాజరాజేశ్వర స్వామివారికి భక్తు ల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో నూతన వసతిగృహాల నిర్మించాలన్నారు. గుడి చెరువులో వంద గదుల నిర్మాణం, బద్ది పోచమ్మ ఆలయ సమీపంలో గదుల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించించారు.
తర్వాత అందు కోసం స్థలాన్ని పరిశీలించారు. బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ నిర్మాణం పనుల్లో వేగం పెంచాలని సూచించారు. పట్టణంలోని రెండో బైపాస్ రహదారిలో రూ.70లక్షలతో 60స్టాల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. కూరగాయల వ్యాపారులకు అనువుగా ఉండేలా ఈ పనులు చేపట్టామని వివరించారు. అలాగే వేములవాడ పట్టణ ప్రజలతోపాటు రాజన్న భక్తులకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా వేములవా డ మూలవాగు వంతెన నుంచి రాజన్న ఆలయం వరకు మొదటి దశ రహదారి విస్తరణ పనులను చేపట్టాలని సూచించారు. రహదారి విస్తరణతోపాటు మూలవాగుపై వంతెన నిర్మాణ పనులు త్వరగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వేములవాడ గుడి చెరువు, మూలవాగులో మురుగు నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చెకపల్లి రహదారిలోని కట్టు కాలువ, రెండో బైపాస్ రోడ్డులోని పార్ వద్ద మూలవాగులో కలుస్తున్న మురుగు నీటిని పరిశీలించారు. పిల్ల కాలువల ద్వారా గుడి చెరువులో మురుగు నీరు చేరకుండా ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని ఎస్టీపీ ప్లాంట్ నిర్మించి నీటిని శుద్ధి చేసి వదలాలని ఆదేశించారు. సమావేశంలో వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, రాజన్న ఆలయ ఈఈ రాజేశ్, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, తహసీల్దార్ మహేశ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఇంటిగ్రేటెడ్ మారెట్ను వినియోగంలోకి తేవాలి
పట్టణంలోని భగవంతరావునగర్‌లో 3కోట్లతో నిర్మించిన సమీకృత కూరగాయల మారెట్ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాకు కౌన్సిలర్ మహేశ్ వినతిపత్రం అందజేశారు. పట్టణ నడిబొడ్డులో ఉన్న మారెట్ భవనం ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని కోరారు. వార్డులోని పలు సమస్యలు కూడా పరిషరించాలని ఆయన కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

