ఎక్లాస్పూర్ స్కూల్ అధ్వానం
మంథని మండలం ఎక్లాస్పూర్ ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాల అధ్వానంగా మారింది. కొద్ది రోజులుగా పడుతున్న వర్షాలకు ఆవరణ చెరువులా మారడం, స్కూల్‌కు వచ్చే రోడ్డు బురదమయంగా తయారవడంతో పిల్లలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది.
- ఆవరణ అంతా బురద మయం
- ఎక్కడికక్కడ నిలుస్తున్న వర్షపు నీరు
- తరగతి గదుల్లోకి వెళ్లేందుకు పిల్లల సర్కస్ ఫీట్లు
- కలెక్టర్ ఆదేశించినా మారని తీరు
మంథని రూరల్, జూలై 26 : మంథని మండలం ఎక్లాస్పూర్ ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాల అధ్వానంగా మారింది. కొద్ది రోజులుగా పడుతున్న వర్షాలకు ఆవరణ చెరువులా మారడం, స్కూల్‌కు వచ్చే రోడ్డు బురదమయంగా తయారవడంతో పిల్లలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలు ఒకే కాంపౌండ్‌లో ఉన్నాయి. హైస్కూల్లో సుమారుగా 150 మంది, ప్రాథమిక పాఠశాలలో 60 మంది అభ్యసిస్తున్నారు. చిన్నపాటి వాన పడినా చాలు ఆవరణ అంతా నీటితో నిండిపోతున్నది.
తరగతి గదులకు రావాలంటే నీటిలో ఏర్పాటు చేసిన ఇటుకలపై నడుస్తూ సర్కస్ ఫీట్లు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఇంకా తరచూ వర్షపు నీరు నిలుస్తుండడంతో పిచ్చి మొక్కలు పెరగడంతోపాటు దోమలు ఉధృతి కూడా పెరుగుతుండడంతో పిల్లలు చదువుకోలేకపోతున్నారు. ఈ నెల 4న కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎక్లాస్‌పూర్‌లోని జడ్పీ, ప్రాథమిక పాఠశాలను సందర్శించి, గ్రౌండ్లో నీరు నిల్వ ఉండటాన్ని గమనించి ఆగ్రహించా రు. గ్రౌండ్ లెవలింగ్ పనులు చేపట్టి వెంటనే చేపట్టాలని ఆదేశించారు. కానీ, రోజులు గడుస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. మళ్లీ కలెక్టర్ దృష్టి సారిస్తేనే సమస్య పరిష్కారమవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

