అద్భుత డిజైన్లతో మానేరు రివర్ ఫ్రంట్
- మంత్రి గంగుల కమలాకర్
- హైదరాబాద్‌లో డిజైన్ కన్సల్టెన్సీ, ఏజెన్సీ, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష
కరీంనగర్ శివారులో నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ అద్భుతమైన డిజైన్లతో సిద్ధం కానుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో డిజైన్ కన్సల్టెన్సీ, ఏజెన్సీ, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో ప్రాజెక్ట్ పురోగతిపై సమీక్షించి, లైటింగ్, ఫౌంటెయిన్ల ఏర్పాట్లు, డిజైన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కార్పొరేషన్, మే 24: కరీంనగర్‌కు ప్రతిష్టాత్మకంగా సాగుతున్న మానేరు రివర్ ఫ్రంట్ అద్భుతమైన డిజైన్లతో సిద్ధం కానుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మంగళవారం మంత్రి హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో డిజైన్ కన్సల్టెన్సీ, ఏజెన్సీ, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో ప్రాజెక్ట్ పురోగతిపై సమీక్షించారు. ముఖ్యంగా లైటింగ్, ఫౌంటెయిన్ల ఏర్పాట్లు, డిజైన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ నగరాన్ని ప్రపంచపటంలో అత్యుత్తమంగా నిలిపే విధంగా మానేర్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ రూపుదాల్చనుందని మంత్రి పేర్కొన్నారు. మొదటివిడుతలో రూ. 410 కోట్ల నిధులతో 4 కిలోమీటర్ల పనులు పూర్తి చేస్తామన్నారు. అత్యంత వేగంగా నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని, ఇందుకోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. కాగా ఇప్పటికే ఈ ప్రాజెక్టులో భాగంగా అల్గునూర్ వైపు పనులు సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఐఎన్ఐ కన్సల్టెన్సీ ప్రతినిధి వంశీ, రైనో సంస్థకు చెందిన నాయుడు, అనిల్, కునాల్‌లు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

