Dasari Manohar Reddy | దీక్షా దివస్ బహిరంగ సభను విజయవంతం చేయాలి.. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
తెలంగాణ ఉద్యమ చరిత్రలో 'దీక్షా దివస్' ఒక కీలక మలుపు అని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
Dasari Manohar Reddy | పెద్దపల్లి, నవంబర్ 27(నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యమ చరిత్రలో ‘దీక్షా దివస్’ ఒక కీలక మలుపు అని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ సమీపంలో నిర్వహించనున్న ‘దీక్షా దివస్ స్ఫూర్తి బహిరంగ సభ’కు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నట్లు తెలిపారు. ఈ సభకు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలివెల్లి విజయవంతం చేయాలని నియోజకవర్గ ప్రజలు, యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన ఆ నాటి ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ.. నాడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష త్యాగ ఫలితంగానే తెలంగాణ ప్రక్రియ వేగవంతమై, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని మనోహర్ రెడ్డి గుర్తు చేశారు. దీక్షా దివస్ సందర్భంగా ఆదివారం జరిగే బహిరంగ సభకు పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం నుంచి ఒక బస్సు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గ్రామాల్లో యువకులు, నాయకులు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నారని, ఇంకా ఎక్కడైనా మిగిలి ఉంటే ఈరోజు సాయంత్రంలోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. నిర్ణీత సమయంలోగా ప్రతీ ఒక్కరూ సభా ప్రాంగణానికి చేరుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉప్పు రాజ్ కుమార్, నాయకులు సలేంద్ర రాములు, పల్లె మధు, రేండ్ల నాగరాజు, కారు పాకల సంపత్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Piyush Goyal | భారత్-అమెరికా ట్రేడ్ డీల్ తుదిదశకు చేరింది : పీయూష్ గోయెల్
Murder | పాతబస్తీలో కార్ల వ్యాపారి దారుణ హత్య..నిందితుడి కోసం గాలింపు
Dhadkan | బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ధడ్కన్’కు సీక్వెల్.. కొత్త తారాగణంతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మేకర్స్!
TTD | వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లు, టోకెన్లు విడుదల తేదీని ప్రకటించిన టీటీడీ
Laxma Reddy | జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

