Deeksha Divas | కేసీఆర్ శాంతియుత తెలంగాణ పోరాటం ప్రపంచానికే ఆదర్శం.. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రధాత కేసీఆర్ శాంతియుత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం దేశానికి ఆదర్శమని లండన్ ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం ఉపాధ్యక్షుడు రవికుమార్ పేర్కొన్నారు. యూకే లోని లండన్‌లో కేసీఆర్ దీక్షా దివాస్‌ని ఎన్నారై బీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం ఘనంగా నిర్వహించారు.
- లండన్‌లో ఘనంగా దీక్షాదివాస్
Deeksha Divas | కోరుట్ల, నవంబర్ 30: తెలంగాణ రాష్ట్ర ప్రధాత కేసీఆర్ శాంతియుత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం దేశానికి ఆదర్శమని లండన్ ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం ఉపాధ్యక్షుడు రవికుమార్ పేర్కొన్నారు. యూకే లోని లండన్‌లో కేసీఆర్ దీక్షా దివాస్‌ని ఎన్నారై బీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం ఉపాధ్యక్షుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూకే నలుమూలల నుంచి నాయకులు తెలంగాణ వాదులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నవీన్ రెడ్డి మాట్లాడుతూ నవంబర్ 29, 2009న తెలంగాణ వచ్చుడో-కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదం తో కేసీఆర్ తల పెట్టిన దీక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక కీలక ఘట్టమన్నారు. తెలంగాణ ప్రజల దశబ్ధాల కలను సాకారం చేసే క్రమంలో కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టిన మహోన్నత ఉద్యమకారుడని కొనియాడారు. సకల జనులను ఏకం చేసి, శాంతి యుత పోరాటంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం ప్రపంచానికే ఆదర్శమని తెలిపారు.
నాడు భారత స్వాతంత్ర్య ఉద్యమానికి గాంధీజీ ఎంచుకున్న అహింసా పద్ధతిని మన తెలంగాణ గాంధీజీ కేసీఆర్ పాటించి రాష్ట్ర సాధనోద్యమంలో ఎటువంటి హింసకు తావు లేకుండా, శాంతియుత మార్గంలో ఏదైన సాధించవచ్చనే గొప్ప సందేశాన్ని, అటు భారత దేశ పౌరులకే కాకుండా, ప్రపంచానికే గొప్ప సందేశాన్నీ అందించిన గొప్ప స్పూర్తి ప్రదాత మన కేసీఆర్ అని ప్రశంసించారు. కేసీఆర్ తలపెట్టిన అప్పటి ఉద్యమ జ్ఞాపకాలని వారుగుర్తు చేసుకున్నారు.
కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వారి వెంట ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవేంద్ర యాదవ్, ఉపాధ్యక్షుడు హరి గౌడ్ నవాపేట్, సతీష్ రెడ్డి గొట్టిముక్కుల, సత్య మూర్తి చిలుకుల, రవి రేటినేని, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, మాజీ అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ శ్రీకాంత్ జెల్ల, అడ్వైజరీ సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి, కార్యదర్శి-ఐటీ, మీడియా పీఆర్ రవి ప్రదీప్ పులుసు, కోశాధికారి సురేష్ బుడగం, సోషల్ మీడియా కన్వీనర్స్ అంజన్ రావు, పవన్ కళ్యాణ్, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Jagityal
- Karimnagar
- KCR
- Korutla
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

