వారాల ఆనంద్‌కు జాతీయ సాహిత్య అవార్డు
కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవి, సినీ విమర్శకుడు, సాహితీ గౌతమి సలహాదారు వారాల ఆనంద్ కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారానికి ఎంపికయ్యారు. గుల్జార్ గ్రీన్ పద్యాలను తెలుగులోకి ‘ఆకుపచ్చ కవితలు’ పేర చేసిన అనువాదానికి 2022 సంవత్సరానికి గానూ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు
కమాన్‌చౌరస్తా, డిసెంబర్ 22 : కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవి, సినీ విమర్శకుడు, సాహితీ గౌతమి సలహాదారు వారాల ఆనంద్ కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారానికి ఎంపికయ్యారు. గుల్జార్ గ్రీన్ పద్యాలను తెలుగులోకి ‘ఆకుపచ్చ కవితలు’ పేర చేసిన అనువాదానికి 2022 సంవత్సరానికి గానూ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సాహితీ గౌతమి పక్షాన డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, గాజుల రవీందర్, నంది శ్రీనివాస్, కవి దాస్యం సేనాధిపతి, సమైక్య సాహితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాడిశెట్టి గోపాల్, కేఎస్ అనంతాచార్య, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
బయోడేటా
పూర్తి పేరు : వారాల ఆనంద్
పుట్టిన తేదీ : 21/8/1958
జన్మస్థలం : వేములవాడ
ప్రస్తుత నివాస స్థలం : గణేశ్‌నగర్, కరీంనగర్
తల్లిదండ్రులు: అంజయ్య రాధ
కుటుంబం: భార్య ఇందిర, కొడుకు అన్వేష్, కూతురు రేల
చదువు : మూడు విభాగాల్లో (ఫిలాసఫీ, లైబ్రరీ సైన్స్, తెలుగు) పీజీ
ఉద్యోగం: 1978లో మంథనిలో లైబ్రేరియన్‌గా విధుల్లో చేరారు.
- కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల లైబ్రేరియన్‌గా విధులు, 2017లో విరమణ.
ఇతర సేవలు: కరీంనగర్ ఫిలిం సొసైటీ స్థాపనలో కీలక పాత్ర, పలు డాక్యుమెంటరీల చిత్రీకరణ - కేంద్ర సెన్సార్ కమిటీ సభ్యుడిగా విధులు
- ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియాకు సెక్రటరీగా బాధ్యతలు
- జింబో, పీఎస్ రవీంద్ర, అలిశెట్టి ప్రభాకర్‌తో కలిసి ‘లయ’ అనే కవిత్వ సంకలనాన్ని విడుదల చేశారు.
- 1999లో నవ్య చిత్ర వైతాళికులు, మానేరు తీరం(కవిత్వం), బాలల చిత్రాలు
- 2001లో సినీ సుమాలు, 24 ఫ్రేమ్స్
- 2010లో మానేరు గలగల, మెరుపు (సాహిత్యకారుల ఇంటర్వ్యూలు)
- 2017లో మనిషి లోపల (కవిత్వం)
- 2018లో అక్షరాల చెలిమి (కవిత్వం), బంగారు తెలంగాణలో చలనచిత్రం 2018, తెలంగాణ సినిమా దశ, దిశ
- 2019లో ఆకుపచ్చ కవితలు (గుల్జార్ గ్రీన్ పోయమ్స్ అనువాదం)
ఇతర అవార్డులు: నంది అవార్డు
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

