Korutla | సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యమివ్వాలి.. కు.ని ఆపరేషన్లపై దృష్టి సారించాలి..!
కోరుట్ల, నవంబర్ 29 : ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల (Normal Delivery)కు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఉప-వైద్యాధికారి డాక్టర్ ముస్కు జైపాల్ రెడ్డి (M Jaipal Reddy) అన్నారు.
కోరుట్ల, నవంబర్ 29 : ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల(Normal Delivery)కు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఉప-వైద్యాధికారి డాక్టర్ ముస్కు జైపాల్ రెడ్డి (M Jaipal Reddy) అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ వంద పడకల ఏరియా దవాఖాన(Area Hospital)ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసూతి వార్డును పరిశీలించిన ఆయన.. గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కాన్పు తర్వాత తల్లీబిడ్డల ఆరోగ్యం గురించి తెలుసుకున్న జైపాల్ రెడ్డి.. అనంతరం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించాలని సిబ్బందికి జైపాల్ రెడ్డి సూచించారు. అనంతరం పట్టణంలోని పలు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను ఆయన తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్కానింగ్ సెంటర్ నిర్వహకులను ఆయన ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షలు జరిపితేచట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉపవైద్యాధికారి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆస్పత్రి సూపరిండెంట్ సునీత రాణి, వైద్యులు చైతన్య సుధ, విజయలక్ష్మి, వినోద్, రమేష్, హెల్త్ ఎడ్యుకేటర్ భూమేష్, శంకర్, సూపర్వైజర్లు ధనుంజయ్, నాగ భూషణం ఫార్మసిస్ట్ ఉదయ్ ప్రసాద్, రబ్బానీ రియాజ్, సాజిద్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

