Home
Karimnagar
Complaint Filed Against Former Mpp For Making Inappropriate Remarks About Journalists
జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీపీపై ఫిర్యాదు
ఓబులాపూర్ ఎస్టీ తండ గ్రామాలకు చెందిన గ్రామస్తులు రత్నాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ నల్ల రాజన్నపై పోలీస్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
మల్లాపూర్, సెప్టెంబర్ 16: అటవీ ప్రాంతంలో అక్రమంగా టేకు కలప చెట్లను నరికివేతకు సంబధించిన అంశంలో జగిత్యాల జిల్లాలోని ఓబులాపూర్, ఓబులాపూర్ ఎస్టీ తండ గ్రామాలకు చెందిన గ్రామస్తులు రత్నాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ నల్ల రాజన్నపై పోలీస్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో మండలంలో ఓ పత్రికకు సంబధించిన విలేకరికి ఫోన్ చేసి సదరు నేత ఇష్టానుసారంగా దుర్భాషలాడ మాట్లాడి అవమానించారు.
ఈ విషయంమై జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం పోలీస్టేషన్లో ఎస్ఐ అనిల్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ అండదండలతో జర్నలిస్టులపై అనుచితంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని, దీనిపై శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ మండల జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

