Road safety | రోడ్డు భద్రత నియమాలు పాటించడం మనందరి భాద్యత : జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
రోడ్డు భద్రత(Road safety) నియమాలు పాటించడం మనందరి భాద్యత అని కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు.
జగిత్యాల : రోడ్డు భద్రత(Road safety) నియమాలు పాటించడం మనందరి భాద్యత అని కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. గురువారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం – 2026 బైక్ ర్యాలీని జిల్లా కేంద్రంలో కలెక్టర్ సత్యప్రసాద్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యమని తెలిపారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉందన్నారు. మద్యం సేవించి వాహనం నడపరాదని హెచ్చరించారు.
అధిక వేగం ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలిపారు. లైసెన్స్ లేకుండా వాహనం నడపకూడదన్నారు. వాహన పత్రాలు సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు. రోడ్ సేఫ్టీ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ నుండి కొత్త బస్టాండ్ వరకు కొనసాగింది. “హెల్మెట్ ధరించండి – ప్రాణాలు కాపాడుకోండి” అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

