3.40కోట్ల బిల్లు మాఫీ

- తొమ్మిది నెలలుగా కోమాలో గల్ఫ్ దవాఖానలో వలస కార్మికుడు
- అండగా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి
జగిత్యాల కలెక్టరేట్, సెప్టెంబర్ 17: బతుకుదెరువు కోసం దుబాయి వెళ్లిన ఓ కార్మికుడు అనారోగ్యం పాలై దవాఖానలో చేరి కోమాలోకి వెళ్లాడు. తొమ్మిది నెలలుగా అక్కడి దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. హాస్పిటల్ బిల్లు 16,71,886.81ధరమ్స్(3.40కోట్లు)కు చేరింది. బిల్లు చెల్లించేవారులేక, స్వగ్రామం చేరే దిక్కులేని బాధితుడికి గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అండగా నిలిచింది. ఇండియన్ కాన్సులేట్‌తో మాట్లాడి బిల్లు మాఫీ చేయించి బాధితుడిని హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖానకు చేర్చారు. వివరాలను గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షుడు గుండేటి నర్సింహ, ఉపాధ్యక్షుడు ఆరె శేఖర్ నమస్తే తెలంగాణకు వివరించారు. జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం సుద్దపెల్లి గ్రామం సుద్దపెల్లికి చెందిన కట్ల గంగారెడ్డి జీవనోపాధి కోసం దుబాయి వెళ్లాడు. అనారోగ్యంతో గత డిసెంబర్లో దుబాయిలోని ఓ దవాఖానలో చేరాడు. పెరాలసిస్‌తో గంగారెడ్డి కోమాలోకి వెళ్లాడు. అప్పటినుంచి అదే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. గంగారెడ్డిని స్వగ్రామానికి చేర్చాలని బాధితుడి కొడుకు మణికంఠ, అతడి స్నేహితుడు ఇబ్రహీం గల్ఫ్ కార్మికుల రక్షణ సమితిని ఆశ్రయించారు. దీంతో సమితి సభ్యులు దుబాయిలో ఉన్న ఇండియన్ కాన్సులేట్ సాయంతో హాస్పిటల్ వర్గాలతో మాట్లాడి దవాఖాన బిల్లు 16,71లక్షల ధరమ్స్ విమానాశ్రయానికి, అక్కడి నుంచి నిమ్స్ దవాఖాన వరకు ఎయిర్ అంబులెన్స్‌కు, ప్రయాణానికి అవరసమై న 4.40లక్షలను సైతం ఇండియన్ కాన్సులేట్ సమకూర్చిందని గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అద్యక్ష ఉపాధ్యక్షులు గుండెల్లి నర్సింహ, ఆరె శేఖర్ తెలిపారు. బిల్లు మాఫీ చేయించిన ఇండియన్ కాన్సులేట్, దవాఖానకు, దుబాయి పోలీసులకు గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

