Karimnagar | ముకరంపుర, సెప్టెంబర్ 25 : కరీంనగర్ లోని ఎన్పీడీసీ ఎల్ ఎస్ఈ కార్యాలయం నుంచి కెమిస్ట్ భవన్ వెపునకు వెళ్లే దారిలో విద్యుత్ ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడున్న ఎల్టీ లైన్ తీగలకు సపోర్ట్ గా ఓ కర్రను ఉంచారు. పక్కనే కొత్తగా భవన నిర్మాణ పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నందున గాలి, వరద ప్రవాహం ధాటికి కర్ర కదిలి పడిపోతే ఆ ప్రాంతం కరెంట్ షాక్ కు గురయ్యే ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళ చెందుతున్నారు.
విద్యుత్ సంస్థ కార్యాలయానికి కూత వేటు దూరంలో, నిత్యం సంస్థ ఉన్నతాధికారులు రాకపోకలు సాగించే మార్గంలోనే ఈ పరిస్థితి ఉన్నా సరిదిద్దే చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. అధికారులు స్పందించి లైన్ ను సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు.