Jagityal | ఇటిక్యాలలో తల్లిదండ్రులను ఇంట్లోంచి గెంటేసిన కొడుకులు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అజ్మీరా మురళి(61), సుశీల(60) అనే వృద్ధ తల్లి దండ్రులను వారి ఐదుగురు కొడుకులు రవి, పాండు, సురేష్, వెంకటేష్, రాజేందర్ పోషణ, వైద్య ఖర్చులు పెట్టక కొట్టి ఇంట్లోంచి గెంటి వేశారని సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది హరి అశోక్ కుమార్ ను ఆ వృద్ధ తండ్రి శనివారం ఆశ్రయించారు.
Jagityal | జగిత్యాల, నవంబర్ 28 : జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అజ్మీరా మురళి(61), సుశీల(60) అనే వృద్ధ తల్లి దండ్రులను వారి ఐదుగురు కొడుకులు రవి, పాండు, సురేష్, వెంకటేష్, రాజేందర్ పోషణ, వైద్య ఖర్చులు పెట్టక కొట్టి ఇంట్లోంచి గెంటి వేశారని సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది హరి అశోక్ కుమార్ ను ఆ వృద్ధ తండ్రి శనివారం ఆశ్రయించారు. కాగా శనివారం సీనియర్ సిటిజెన్స్ ప్రతినిధులతో ఆ తండ్రి వెళ్లి ఆర్డీవోకు ఫిర్యాదు చేయగా వయో వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం 2007 కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆ వృద్ధ తండ్రి అజ్మీరా మురళి సీనియర్ సిటిజెన్స్ కార్యాలయంలో తన గోడు విలేకరులకు వెల్లబోసుకున్నారు. తాను దుబాయ్ వెళ్లి కష్టించి పని చేసిన డబ్బులతో ఇటిక్యాల గ్రామంలో ఐదుగురు కొడుకులకు ఐదు బంగ్లాలు కట్టించానని, వృద్ధాప్యంలో అనారోగ్యంతో బాధలు పడుతున్న తల్లి దండ్రులమైన తమను తమ కొడుకులు పోషించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా తాము కట్టించిన బంగ్లాలో కూడా మమ్మల్ని ఉండకుండా కొట్టి ఇంటి నుండి గెంటి వేయగా బంగ్లాల బయట రేకుల షెడ్డులో ఆర్థిక, శారీరక ఇబ్బందులతో బతుకుతున్నామని వాపోయారు. తమను ఆదుకోవాలని సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది హరి అశోక్ కుమార్ ను ఆశ్రయించినట్లు వారు పేర్కొన్నారు. అలాగే ఆర్డీవోకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ విషయంపై ఎస్పీకి సైతం ఫిర్యాదు చేస్తానని బాధితుడు తెలిపారు. ఈ సమావేశంలో చట్టం కాన్సిలియేషన్ అధికారులు పీసీ హన్మంత్ రెడ్డి, ఎండీ యాకూబ్, సీనియర్ సిటిజెన్స్ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- house
- itikyala
- Jagityal
- Karimnagar
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | సస్పెన్స్‌కు ఫుల్స్టాప్.. చిరంజీవి ‘కాకా’ను రిలీజ్ చేస్తుందెవరో తెలుసా..?
‘ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి’
IAS Transfers | రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్‌ల బదిలీ.. ప్రత్యేక అధికారిగా సర్పరాజ్ నియామకం
Railway Jobs | రైల్వేలో 191 ఐసోలేటెడ్ పోస్టులు.. డిసెంబర్ 4తో ముగియనున్న గడువు
విశాఖలో విద్యార్థుల విహారయాత్రలో ప్రమాదం.. కైలాసగిరి లోయలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

